హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికను మార్చి 16వ తేదీ నుంచి 22కు వాయిదా వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది డి.వి.రావు దాఖలు చేశారు. ఇంటర్ పరీక్షలను కారణంగా చూపుతూ ఎమ్మెల్సీ ఎన్నికను వాయిదా వేశారని, వాస్తవానికి ఎన్నికను 22న కాకుండా 15న నిర్వహించాలని, ఆ రోజు ఆదివారమని డి.వి.రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎన్నిక వాయిదా వల్ల అభ్యర్థుల ఎన్నిక ఖర్చు పెరగడమే కాకుండా, అవినీతి కూడా పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ నిర్వహించిన సర్వేలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు తేలిందని తెలిపారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికను మార్చి 15న నిర్వహించేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదాపై పిటిషన్
Published Thu, Feb 26 2015 12:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement