హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు జీహెచ్‌ఎంసీ వాక్ వేలో యాచకుల బెడద వాకర్లకు ఇబ్బందిగా మారుతున్నదని, ఇక్కడ యాచించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని భానుమూర్తి అనే వాకర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఆదివారం ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ తక్షణమే తనిఖీలు చేపట్టి వాక్‌వేలో యాచిస్తున్న వారిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులను ఆదేశించారు.
దీంతో సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులు ఆదివారం రాత్రి వాక్‌వేలో తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళ ఇక్కడకు వస్తున్న వాకర్లతో పాటు పక్కనే ఉన్న హోటల్‌వద్ద టీ తాగేందుకు వచ్చిన కస్టమర్ల వద్ద యాచిస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను బంజారాహిల్స్‌రోడ్ నెం.2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక నివాసం ఉంటున్న కుమారుడి వద్దకు చేర్చారు.
అయితే ఆమె బెగ్గర్ కాదని, సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిందని కుమారుడు ఽఅధికారులకు చెప్పారు. మరోసారి బయటకు రాకుండా చూసుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని తల్లీకొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment