
ఒంగోలులో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాలినేని
భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బాధితులను ఆయన దగ్గర ఉండి పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా బాలినేని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే పునరావాసం కల్పిస్తామని ఆయన వర్షాల వల్ల నిరాశ్రయులైన వారికి హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో సర్వం కొల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని బాలినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనకనమెట్ట మండలం వెదురురాళ్లపాడు గ్రామ సమీపంలోని వాగులో చిక్కుకున్న బస్సులో చిక్కుకున్న మగ్గురు ప్రయాణీకులను రక్షించిన అధికారులను బాలినేని ఈ సందర్భంగా అభినందించారు. అలాగే ఆ బస్సులో మిగత నలుగురు ప్రయాణికులను కూడా రక్షించాలని అధికారులను బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.