పేదల సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం
► అలుపెరుగని పోరాట యోధుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
► పార్టీ ఏడో ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షుడు బాలినేని
ఒంగోలు అర్బన్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఏడో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్న దివంగత నేత వైఎస్సార్ పేరుతో పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో బూటకపు హామిలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ట పెంచి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారం చేపట్టి ప్రజల మన్ననలు పొందుతుందని బాలినేని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. కుల మత, రాజకీయాలకు అతీతంగా దివంగత నేత ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే ప్రజా సంక్షేమం కోసం యువనేత వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ స్థాపించారని బత్తుల పేర్కొన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శింగరాజు వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల నాగరాజు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి అన్నెం వెంకట్రామిరెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బడుగు కోటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పమ్మి శేషిరెడ్డి, వాణిజ్య విభాగం జిలా అధ్యక్షుడు డీఎస్ క్రాంతికుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కావూరి సుశీల, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, సేవాదళ్ నగర అధ్యక్షుడు వల్లెపు మురళి, ప్రచార విభాగం నగర అధ్యక్షుడు ధూళిపూడి ప్రసాద్, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, నాయకులు లంకపోతు అంజిరెడ్డి, జాజుల కృష్ణ, శామ్యేలు, బుల్లెట్ కృష్ణారెడ్డి, పి.జేమ్స్, అరుణ, పురిణి ప్రభావతి పాల్గొన్నారు.