సాక్షి, ఒంగోలు : ప్రజలను అనుసరించే వాడే నిజమైన నాయకుడు.. ఎందరో అతిరథ మహారథుల విషయంలో ఈ మాట అక్షర సత్యమైంది. ఇది ఎన్నికల సమయం.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వారి అవసరాలేమిటో తెలుసుకునేందుకు నేతలంతా ఊరూవాడా తిరుగుతున్నారు. తామేం చేస్తామో చెప్పి హామీ ఇస్తున్నారు. ప్రజలు చూపిస్తున్న ఆద రణను బట్టి నాయకులు గెలుపోటములను బేరీజు వేసుకుంటుండగా.. ప్రజలు మాత్రం ఁవిశ్వసనీయత* గల నేతకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు.
వైఎస్సార్ సీపీదే విజయమంటున్న సర్వేలు
ఓటరు నాడి తెలుసుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీల కంటే ముందంజలో ఉంది. ప్రచారంలోనే కాదు పథకాల రూపకల్పనలో ఆ పార్టీ ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వే సంస్థలు వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని వెల్లడించడంతో ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుడుతోంది. సీనియర్ రాజకీయ నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు, వివిధ సామాజిక వర్గాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు, మహిళలు స్వచ్ఛందంగా సమావేశాలు పెట్టుకుని మరీ.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టీడీపీ కుతకుత
టీడీపీ నేతలకు జిల్లా ఓటర్ల మనోగతం ఏ మాత్రం అర్థం కానట్టుంది. ఓట్లు, సీట్ల కోసం టీడీపీ తొక్కని అడ్డదారి లేదు.. చేయని కుట్ర లేదు. పదవి కోసం అర్రులు చాస్తున్న ఆ పార్టీ అభ్యర్థులు బరితెగించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీకి ప్రజాదరణ లేకపోవడంతో వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. నేరుగా ఓటర్లను కలసి ఓట్లు అభ్యర్థిస్తే ప్రయోజనం ఉండదని తెలిసి.. తెరవెనుక రాజకీయం చేస్తున్నారు. సామాజికవర్గ మంత్రం జపిస్తూ.. ఆర్థిక మంత్రాంగం చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కులపెద్దలు, సంఘాలతో రాత్రిళ్లు మంతనాలు సాగిస్తున్నారు. లొంగని వారిని బెదిరిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీడీపీ డబ్బు లేదా బలగంతో ఓట్లు కొల్లగొట్టాలని.. లేదంటే కులం పేరు చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్న విషయం ఇటీవల పలు గ్రామాల్లో స్పష్టమైంది. తన రెండుకళ్ల సిద్ధాంతంతో చేతలుడిగిన టీడీపీకి.. బీజేపీతో పొత్తు ద్వారా ప్రాణం పోయాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారు. వీటి ఫలితంగా టీడీపీ అభ్యర్థులు సొంత సామాజికవ ర్గాల్లో పట్టు కోల్పోయారు. ప్రచారంలో సైతం వెనుకబడ్డారు. పలు నియోజకవర్గాల్లో స్థానికేతరులకు సీట్లు ఇవ్వడంతో అక్కడి ప్రజలు వారిని ఆదరించడం లేదు. ప్రచారానికి వెళ్లడం అనవసరమని భావించిన టీడీపీ నేతలు డబ్బు వెదజల్లేందుకు సన్నాహాలు చేస్తున్నారనే విషయం సర్వత్రా చ ర్చనీయాంశమైంది.
ప్రలోభాలు, బెదిరింపులు
టీడీపీ గట్టెక్కించలేని పక్షంలో కనీసం గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు సంపాదించాలని టీడీపీ పెద్దలు స్థానిక నేతలకు హితబోధ చేసినట్టు సమాచారం. దీంతో టీడీపీ నేతలు కుల రాజకీయాలకు తెర తీశారు. అభ్యర్థులు తమ సామాజికవర్గ పెద్దలనుకలసి.. తమను గెలి పిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈ సారి గెలవకుంటే భవిష్యత్‌లో కూడా గెలుపు కష్టమేనని మొరపెట్టుకుంటున్నారు. ఈ ప్రయత్నం ఫలించని చోట బెదిరింపులకు దిగుతున్నారు. తమకు మద్దతు ఇవ్వకుంటే తామిచ్చిన అప్పు వెంటనే తిరిగిచ్చేయాలని.. లేదంటే తమనుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేరని హెచ్చరిస్తున్నారు.
గ్రామాల్లో పెద్దలు అణగారిన వర్గాలపై ఈ రకమైన ఒత్తిళ్లు చేయడం ఎక్కువైపోయింది. అంతేగాకుండా తాము చెప్పిన అభ్యర్థికి కాకుండా ఇతర పార్టీలకు ఓట్లేస్తే కులం, గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నేతల చర్యలపై గ్రామాల్లో సామాజికవర్గాల నుంచి తిరుగుబాటు వ్యక్తమవుతోంది. గ్రామ రచ్చ బండల వద్ద పెద్దలు వైఎస్సార్ సీపీ, టీడీపీ ప్రచార శైలిపై చర్చించుకుంటున్నారు. అధికారం కోసం అరాచకానికి పాల్పడుతున్న టీడీపీ నేతలకు బుద్ధి చెప్పి.. విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు.
‘విశ్వసనీయత’కు ఓటు
Published Tue, Apr 29 2014 2:22 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement