పీతల సుజాత తీవ్ర మనస్థాపం | peethala sujatha unhappy in B R Ambedkar birth anniversary | Sakshi
Sakshi News home page

పీతల సుజాత తీవ్ర మనస్థాపం

Published Thu, Apr 14 2016 2:04 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

పీతల సుజాత తీవ్ర మనస్థాపం - Sakshi

పీతల సుజాత తీవ్ర మనస్థాపం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు అవమానం జరిగింది. గురువారం విజయవాడలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దళిత మంత్రి పీతల సుజాత ఫొటో కనిపించలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందారు. దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పీతల సుజాత ... తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవలే జరిగిన బాబూ జగ్జీవన్రాం జయంతి వేడుకల్లో కూడా పీతల సుజాతకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement