ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
పశివేదల (కొవ్వూరు రూరల్) : ఏనమ్మకంతో ప్రజలు అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. పశివేదలలో గురువారం నిర్వహించిన జన్మభూమి మాఊరు గ్రామసభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న స్వచ్ఛా భారత్, స్వచ్ఛా అంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్టీఆర్ సుజల పథకాన్ని కొనసాగిస్తామన్నారు.
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఎన్నికల హామీలలో ఇప్పటికే పింఛన్ల పెంపు, ఎన్టీఆర్ సుజల పథకాలను అమలు చేశామన్నారు. ఇతర అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేశారు. 12మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు ఎంపీటీసీ రాయపాటి సుబ్బారావు పసుపు కుంకుమ, చీర అందజేశారు. తొలుత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే కేఎస్ జవహార్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, చాగల్లు, కొవ్వూరు జెడ్పీటీసీలు అల్లూరి విక్రమాదిత్య, గారపాటి శ్రీదేవి, ఎంపీపీ వాడవెల్లి రాజ్యలక్ష్మి, సర్పంచ్ బేతిన కాశీఅన్నపూర్ణ భవాని, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి పాల్గొన్నారు.