కర్నూలు: జిల్లాలోని మంగళవారం ఆస్పరిలో చేపట్టిన జన్మభూమి గ్రామసభ రసాభాసగా మారింది. పెన్షన్, తాగునీటిని పట్టించుకోవడం లేదని అధికారులను ప్రజలు నిలదీశారు. దీంతో అధికారులకు-ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగులో గూడుమస్తాన్ వీధిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ కోసం జరిగిన తొక్కిసలాటలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ కార్యక్రమానికి జనం విపరీతంగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పింఛన్ తీసుకుందామని వచ్చిన వృద్ధురాలు ఊపిరాడక మృత్యువాత పడింది.