సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా ఎన్‌ఆర్‌ఐ సొంగా రోషన్‌కుమార్ నియామకం రాజకీయ చిచ్చురేపింది. టికెట్ ఆశిస్తూ ఐదేళ్లుగా రూ.కోట్లు కుమ్మరించిన నేతలను, దళిత మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాతను కాదని కొత్త వ్యక్తికి ఇవ్వడంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ అంశంపై సుజాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో బుధవారం జరిగిన పవన్‌కళ్యాణ్ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు.
దీంతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరిలో ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంపైనా నిరసన వ్యక్తమవుతోంది. అనూహ్యంగా సొంగా రోషన్‌ను ఇన్‌చార్జిగా నియమించడం, టికెట్ అతనికేనంటూ కేడర్‌కు సంకేతాలు పంపేలా నియామక ప్రకటన చేయడంతో చింతలపూడి తెలుగుదేశం పార్టీలో గందరగోళం మొదలైంది. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో దళిత మహిళగా పీతల సుజాత కీలకంగా పనిచేశారు. 2004లో టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందా రు.
ఆ తరువాత రాజకీయ సమీకరణాల కారణాలు చెప్పి 2009లో టికెట్ కేటాయించలేదు. 2014లో చింతలపూడి అభ్యర్థిగా టికెట్ కేటాయించడంతో గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు సామాజికవర్గ ప్రజాప్రతినిధుల చేతుల్లో అవమానాలు, ఇబ్బందులు ఎదు ర్కొని వారి లాబీయింగ్‌తో మంత్రి పదవి నుంచి మధ్యలోనే వైదొలిగారు. 2019 ఎన్నికల్లో చింతలపూడి టికెట్ ఆశించినా మొండిచేయి చూపారు. టీడీపీ ఓటమి అనంతరం ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు.
అయినా పార్టీలోనే ఉండి చింతలపూడిలో క్రియాశీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆమెకు మొండిచేయి చూపడంతో సుజాత వర్గం తీవ్ర అసంతృప్తితో రగులుతోంది. దీనికి తోడు ఉమ్మడి పశ్చిమగోదావరిలోని మూడు రిజర్వు స్థా నాలూ ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి టీడీపీ టి కెట్ కేటాయించిందన్న ప్రచారం బలంగా సాగుతోంది. దళిత మహిళను అవమానపరిచారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుజాతతో పాటు టికెట్ ఆశించిన బొమ్మాజీ అనిల్ కూడా మాగంటి బాబు, చింతమనేనిల ప్రోద్బలంతో యువగళం, చంద్రబాబు సభలకు భారీగా ఖర్చు చేశారు. పార్టీ డబ్బు అవసరాలకు వాడుకుని చివరికి ఆయనకూ మొండిచేయి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment