పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి అధికారం | peethala sujatha Problems on jana Sena leaders affair | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి అధికారం

Published Thu, Aug 7 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి అధికారం

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి అధికారం

 ఇక అధికార తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పీతల సుజాతకూ ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గం చింతలపూడిలో జనసేన నేతల వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఇటీవల హాస్టళ్లపై సమీక్షకు ఆమె చింతలపూడి వచ్చిన సందర్భంలో టీడీపీ నేతలకు, జనసేన నాయకులకు మధ్య బహిరంగంగానే వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సుజాత జనసేన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రగడవరం గ్రామానికి చెందిన  తాళ్లూరి చంద్రశేఖర్‌రెడ్డి బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న తమను పక్కనపెట్టి నిన్నకాక మొన్న వచ్చిన, ఇంకా రాజకీయ పార్టీగా ఓ రూపురేఖల్లేని జనసేన పేరు చెప్పుకు తిరుగుతున్న వారికి ఆమె పెద్దపీట వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
 
 ఇందుకు అక్కడి జనసేన అభిమానులు ఎదురుతిరిగారు. కేవలం తమ నాయకుడి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిం దంటూ వ్యాఖ్యానించారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువర్గాల పెద్దలూ సర్ధిచెప్పడంతో ఆ సమయానికి అక్కడ సద్దుమణిగినా భవిష్యత్‌లో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు టీడీపీకి చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని, నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న జనసేన కార్యకర్తలను సమన్వయం చేయడం పీతల సుజాతకు కత్తి మీద సాములా తయారైంది. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు విపక్షాల నుంచి కాకుండా మిత్రపక్షాల నుంచే సమస్యలు మొదలుకావడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement