jana Sena leaders
-
పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణుల వీరంగం
సాక్షి, అమరావతి/గుడివాడటౌన్/తాడేపల్లి/నెహ్రూనగర్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి కిరణ్‌కు బెయిల్ ఇచ్చి విడుదల చేయించేందుకు పేర్ని నాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో రవికిరణ్‌కు బెయిల్ ఇప్పించిన అనంతరం పేర్ని నాని ఆయన అనుచరులతో కలిసి రాజేంద్రనగర్‌లోని వైఎస్సార్సీపీకి చెందిన తోట శివాజీ ఇంటికి వెళ్లారు. పేర్ని నాని పట్టణానికి వచ్చిన సమాచారం అందుకున్న జనసేన, టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కావడం, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఇంటిబైట ఉన్న నాని కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని.. జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుమారు రెండు గంటలు పైబడి పేర్ని నానికి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం, దాడులు కొనసాగాయి. దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారుతో పేర్ని నాని డ్రైవర్ సిద్ధంగా ఉండగా.. అక్కడకూ వెళ్లి ఆ కారుపైనా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అనంతరం పోలీసులు జనసేన శ్రేణులను అక్కడ నుంచి పంపించి.. పేర్ని నానిని పట్టణం దాటించారు. కాగా, పేర్ని నానిపై టీడీపీ, జనసేన నేతల దాడిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఖండించారు. -
గుడివాడలో పేర్నినాని కారుపై రాళ్ల దాడి
సాక్షి,అమరావతి : గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతుంది. వైఎస్సార్సీపీ నేత వైసీపీ నేత తోట శివాజీ మాజీ మంత్రి పేర్ని నాని,మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వెళ్లారు. ఆ ఇద్దరు నేతలు శివాజీ ఇంట్లో ఉన్న సమయంలో.. ఇంటి బయటే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. తాము దాడి చేసేందుకు వచ్చామంటూ హెచ్చరికలు జారీ చేశారు.టీడీపీ, జనసేన నేతల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారిని నిలురించే ప్రయత్నం చేయలేదు. సుమారు రెండు గంటలకు పైగా పేర్నినాని శివాజీ ఇంట్లోనే ఉన్నారు.ఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్ రాజ్యాంగంఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్‌జ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. కారుపై దాడిచేసి అద్ధాలు పగలగొట్టారు టీడీపీ, జనసేన నాయకులు. పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడ్డారు.సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా ఉండేందుకు న్యాయ సహాయం కోసం పేర్ని నాని, కైలే అనిల్‌లు గుడివాడ వెళ్లారు. ఈ క్రమంలోనే పేర్ని నాని కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కూటమి నేతలు. టిడ్కో గృహాల వద్ద మరో కారును పేర్ని నాని డ్రైవర్ ఉంచగా. అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడికి పాల్పడ్డారు. -
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
బెడిసికొట్టిన జనసేన కిడ్నాప్ డ్రామా
సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులే కిడ్నాప్ చేశారని ఆరోపణలు గుప్పించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు) షాహిద్ కనబడటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. వినుత ఇంట్లో సోదాలు జరిపేందుకు రేణిగుంట పోలీసులు యత్నించగా జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్, ఇతర నాయకులు అడ్డుకున్నారు. తాము తలచుకుంటే కేంద్ర హోం శాఖ దిగుతుందంటూ బెదిరింపులకు దిగారు. జనసేన నాయకురాలు నగరం వినుత, కోట చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి డ్రామా బెడిసికొట్టడంతో జనసేన నేతలు కంగుతిన్నారు. (ఇది ఫెవికాల్ బంధం) -
పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురు దెబ్బ
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. జనసేన పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, సురవరపు సురేష్, టీడీపీ మహిళా నాయకురాలు వర్ధినీడి సుజాత, నాయకులు సింగంపల్లి బాబురావు, తడాల సత్యనారాయణతో పాటు 500 మంది వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఇప్పటికీ చంద్రబాబు పార్టనరేనని.. ఐటీ దాడులపై పవన్‌కల్యాణ్ నోరు విప్పకపోవడానికి కారణం అదేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ అమరావతి రైతులను కలిశారని దొరబాబు విమర్శించారు. పవన్ విధి విధానాలు నచ్చకే జనసేన నుంచి ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఐటీ దాడులపై ఇంత వరుకు చంద్రబాబు నోరు మెదపక పోవడానికి కారణం ఏమిటని..నోరు విప్పితే ఆయన అవినీతి బండారం బయటపడుతుందని భయమా అని అన్నారు. అవినీతి బాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ చేసిన అవినీతిపై లోతుగా సీబీఐ,ఈడీలతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు. -
జనసేన నేతపై ఫిర్యాదు
ఏలూరు టౌన్ : జనసేన పార్టీ నేతపై ఆ పార్టీ కార్యకర్తే తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నా యి.. పెదవేగి మండలం కవ్వగుంటకి చెం దిన పసుపులేటి శ్రీరామభార్గవ్ కృష్ణ జనసేన కార్యకర్త. ఏడాదిన్నర క్రితం నారా శేషు జనసేనలోకి వచ్చి నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు వేసి తనను ప్రమోట్ చేసేందుకు రూ.20 వేలు ఖ ర్చులుగా భార్గవ్ కృష్ణకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత నారా శేషు వ్యవహార శైలి నచ్చకపోవడంతో కృష్ణ తదితరులు అతడికి దూరంగా ఉంటున్నారు. దీంతో కోపం పెం చుకున్న నారా శేషు గతంలో ఖర్చుల కోసం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలంటూ కృ ష్ణను వేధిస్తున్నాడు. రౌడీలను ఇంటికి పంపి బెదిరించాడు. ఈనేపథ్యంలో ఈనెల 15న కృష్ణ తన హూండా డియో స్కూటర్ ఏలూరు అంబికా థియేటర్ సమీపంలో పార్కింగ్ చే యగా కనిపించలేదు. వంగాయగూడెంకు చెందిన వరం, బొత్స మధు అనే వ్యక్తులు తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఇదే సమయంలో వరం కృష్ణకు ఫోన్ చేసి స్కూటర్‌ను నారా శేషు తీసుకురమ్మని చెప్పారని, సొమ్ములు చె ల్లించి తీసుకువెళ్లాలని అనడంతో కృష్ణ పో లీసులను ఆశ్రయించాడు. జనసేన నేత శేషు, వరం, మధుపై ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి అధికారం
ఇక అధికార తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పీతల సుజాతకూ ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గం చింతలపూడిలో జనసేన నేతల వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఇటీవల హాస్టళ్లపై సమీక్షకు ఆమె చింతలపూడి వచ్చిన సందర్భంలో టీడీపీ నేతలకు, జనసేన నాయకులకు మధ్య బహిరంగంగానే వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సుజాత జనసేన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రగడవరం గ్రామానికి చెందిన తాళ్లూరి చంద్రశేఖర్‌రెడ్డి బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న తమను పక్కనపెట్టి నిన్నకాక మొన్న వచ్చిన, ఇంకా రాజకీయ పార్టీగా ఓ రూపురేఖల్లేని జనసేన పేరు చెప్పుకు తిరుగుతున్న వారికి ఆమె పెద్దపీట వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు అక్కడి జనసేన అభిమానులు ఎదురుతిరిగారు. కేవలం తమ నాయకుడి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిం దంటూ వ్యాఖ్యానించారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువర్గాల పెద్దలూ సర్ధిచెప్పడంతో ఆ సమయానికి అక్కడ సద్దుమణిగినా భవిష్యత్‌లో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు టీడీపీకి చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని, నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న జనసేన కార్యకర్తలను సమన్వయం చేయడం పీతల సుజాతకు కత్తి మీద సాములా తయారైంది. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు విపక్షాల నుంచి కాకుండా మిత్రపక్షాల నుంచే సమస్యలు మొదలుకావడం ఇక్కడ గమనించదగ్గ విషయం.