చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి.
చింతలపూడి(పశ్చిమగోదావరి): చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. మాజీ మంత్రి పీతల సుజాతకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో తెలుగు తమ్ముళ్లు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోగా దీనికి నాలుగు మండలాల నుంచి నేతలు హాజరయినట్లు సమాచారం.
చింతలపూడి మార్కెట్ కమిటీ భర్తీ కాకుండా సుజాత మూడేళ్లుగా అడ్డుపడుతున్నారని ఎంపీ మాగంటి బాబు వర్గం ఆరోపిస్తోంది. ఆమె తీరుకు నిరసనగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు వర్గాల మధ్య ముదిరిన వివాదం ఎక్కడి వరకు వెళుతుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.