చింతలపూడి: పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించడంపై పశ్చిమగోదావరి జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ సామాజిక వర్గానికి చెందిన సుజాతను కేబినెట్ నుంచి తప్పించడంపై మాలలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చింతలపూడిలో సోమవారం మాలలు ఆందోళనకు దిగారు. 80 లక్షల మంది మాలలను సీఎం చంద్రబాబు అవమానించారని ఆందోళనకారులు మండి పడ్డారు. 2019 ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
‘మాలలను అవమానించిన చంద్రబాబు’
Published Mon, Apr 3 2017 8:29 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM
Advertisement
Advertisement