
సాక్షి, ఏలూరు: టీడీపీలో మరోసారి దళిత నాయకులపై తమ అక్కసును వెళ్లగక్కారు. మాజీ మంత్రి పీతల సుజాతపై సినీ నిర్మాత, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొగరు అహంకారం అంటూ సుజాతను నోటికొచ్చినట్టు తిట్టారు. ఈ వ్యాఖ్యలను ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వర రావు తీవ్రంగా ఖండించారు.
మంత్రి పదవి చేపట్టి, రాజకీయంగా పేరొందిన దళిత మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీలో దళిత నాయకులపై గౌరవంగా ప్రవర్తించరని, చులకనభావంతో చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నాయకులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment