
సాక్షి, ఏలూరు : ఉప ముఖ్యమంత్రి,వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆళ్ల నాని ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...‘అంబికా రాజా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ఆర్యవైశ్య ప్రజలకు సాయం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరేలా పని చేయాలి. రానున్న అన్ని స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీదే గెలుపు.’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment