
టీడీపీ మంత్రి ఇంటి వద్ద నోట్లకట్టల బ్యాగు కలకలం
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పి.శ్యామ్‌సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి సుజాత ఇంటి కారిడార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్యాగ్‌ను వదిలి వెళ్లారు. ఈ విషయమై ఆ ఇంట్లో పనిచేస్తున్న చికిలే సుబ్బారావు అనే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు. బ్యాగులో 10 లక్షల నగదుతోపాటు తాడేపల్లిగూడెంకు చెందిన కార్ని శ్రీలక్ష్మి అనే యువతికి చెందిన డీఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.