విశాఖపట్నం : రాష్ట్రం కష్టాల్లో ఉన్నా అంగన్ వాడీల జీతాలు పెంచి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని మంత్రి పీతల సుజాత అన్నారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీతాల పెంపు వల్ల ఏడాదికి రూ.710కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. లక్షా నాలుగు వేల మంది ఉద్యోగులకు జీతాల పెంపు వర్తిస్తుందని తెలిపారు.
నిజానికి కేంద్రం ఇస్తున్న వాటా భారీగా తగ్గించినా ఉద్యోగులకు మేలు చేయాలని జీతాలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అంగన్ వాడీ ఉద్యోగులు.. గర్భిణీలు, పిల్లలకు మంచి ఆహారం అందించి సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.
'రాష్ట్రం కష్టాల్లో ఉన్నా జీతాలు పెంచాం'
Published Sun, Feb 7 2016 2:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement
Advertisement