'ఏలూరును రాజధాని చేయాలని కోరాను' | Andhra pradesh govenrment introduces new Sand Mining Policy, says peethala sujatha | Sakshi
Sakshi News home page

'ఏలూరును రాజధాని చేయాలని కోరాను'

Published Wed, Jul 2 2014 10:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

'ఏలూరును రాజధాని చేయాలని కోరాను'

'ఏలూరును రాజధాని చేయాలని కోరాను'

ఏలూరు : ఇసుక తవ్వకాలపై త్వరలోనే నూతన పాలసీ తీసుకురానున్నట్లు  ఆంధ్రప్రదేశ్ గనులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. దీనిపై వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు ఆమె బుధవారమిక్కడ పేర్కొన్నారు.  పిల్ల కాలువల్లో అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని పీతల సుజాత చెప్పారు.

 

పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా అధికారికంగా ఇసుక తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే పీడీపీపీ యాక్ట్, ఐపీసీ 3,7,9 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు ఏలూరును రాజధాని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు పీతల సుజాత తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement