
సాక్షి, వైఎస్సార్: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో టీడీపీ నేతల బెదిరింపుల పర్వం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ మాట వినని వారిపై టీడీపీ నేతలు బెదిరించడమే కాకుండా నోటికి ఇష్టమెచ్చినట్టు దూషిస్తున్నారు. తాజాగా మైదుకూరులో టీటీడీ చైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేశ్ యాదవ్ రెచ్చిపోయారు.
బ్రహ్మంగారి మఠం టీడీపీ అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే రత్నకుమార్ కుమారుడు బాలకృష్ణకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాలకృష్ణను బూతులు కూడా తిట్టారు. కాగా, మహేశ్ మంత్రి యనమల రామకృష్ణునికి అల్లుడు.
Comments
Please login to add a commentAdd a comment