
వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అలాగే గత పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. త్వరలో కొత్త బోర్డు సభ్యుల నియామకం చేపట్టనుంది. కాగా నూతన చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గరుడ ఆళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment