
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు సీఎం చంద్రబాబు అధ్యక్షులను నియమించారు. టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్‌టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యను ఖరారు చేశారు. ఆ జాబితాను పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ సీఎం సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి లభించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment