వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డితో సమావేశమైన నారపురెడ్డి
సాక్షి, దాపాడు: టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు తన కార్యకర్తలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మంగళవారం చియ్యపాడులో ముఖ్య టీడీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డిలు పార్టీని వీడగా.. బుధవారం కేతవరం గ్రామానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుడు నారపురెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు. స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ కర్నాటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారు. నారపురెడ్డి మాట్లాడుతూ పదిహేనేళ్లుగా కార్యకర్తగా, ఐదేళ్లుగా తెలుగు యువత అ«ధ్యక్షుడిగా పని చేస్తున్నా తనను పుట్టా సామాజిక వర్గానికి చెందిన మండలంలోని ముఖ్య నాయకుడు వేధిస్తున్నాడని వాపోయారు. మంగళవారం రాత్రి గ్రామంలో కార్యకర్తలతో సమావేశం కాగా ముఖ్య నాయకుడు తనను కించపరిచేలా వ్యవహరించారన్నారు. దీంతో మనస్థాపం చెంది విలువలు లేని పార్టీలో ఉండలేక బయటకు వచ్చినట్లు తెలిపారు.
పుట్టా ప్రయత్నాలు విఫలం..
కేతవరం గ్రామానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షులు నారపురెడ్డికి మంగళవారం మండల ముఖ్య నాయకుడికి మద్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నారపురెడ్డి పార్టీని వీడుతున్న విషయం తెలుసుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ తమ అనుచరులను సంధి కోసం పంపినా కుదరలేదు. దీంతో స్వయంగా పుట్టానే నారపురెడ్డి ఇంటికెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా.. టీడీపీలో ఉండలేనని, నేనే కాదని నాలా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని నారపురెడ్డి తెలుపగా చేసేదేమీ లేక పుట్టా వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment