ప్రొద్దుటూరులో వైఎస్‌ సునీత, చంద్రబాబు పోస్టర్లు | YS Sunitha Political Entry Posters With Chandrababu At Proddatur | Sakshi

ప్రొద్దుటూరులో వైఎస్‌ సునీత, చంద్రబాబు పోస్టర్లు

Apr 26 2023 7:48 AM | Updated on Apr 26 2023 7:53 AM

YS Sunitha Political Entry Posters With Chandrababu At Proddatur - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారంటూ వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకుల ఫొటోలున్నాయి. అంతేకాక.. సునీత తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి ఫొటోలను కూడా వేశారు. 

ప్రొద్దుటూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఈ పోస్టర్లు వెలుగుచూశాయి. పోస్టర్లలో జై తెలుగుదేశం.. రాజకీయ రంగప్రవేశం చేయనున్న డాక్టర్‌ వైఎస్‌ సునీతమ్మ గారికి స్వాగతం.. సుస్వాగతం అని ఉంది. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం రోడ్డు, వైఎంఆర్‌ కాలనీ, టీబీరోడ్డు, కొర్రపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అంటించారు. అకస్మాత్తుగా వెలుగుచూసిన ఈ పోస్టర్లు పట్టణంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై ప్రొద్దుటూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటిని మంగళవారం వేకువజామున అంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ పోస్టర్లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement