
రాయల్‌కౌంటీలో ఆలీ సందడి
ప్రొద్దుటూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో ఆదివారం అర్ధరాత్రి రాయల్‌బాష్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు ఆలీ హాజరు కాగా జబర్దస్త్ టీం సభ్యులు హైపర్ ఆలీ, రైజింగ్ రాజా, అభి, యోధా సిస్టర్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో రాయల్ కౌంటీ రిసార్ట్స్ ఎండీ జంపాల మధుసూదన్‌రెడ్డితోపాటు డైరెక్టర్లు, సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ మోహన్‌మలావత్ తదితరులు పాల్గొన్నారు.