తాను టీడీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వాపోయారు. తాను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ప్రేమ, అభిమానాలు ఉన్నాయన్నారు.