నేటి నుంచి వైవీయూ అంతర్‌ కళాశాలల పోటీలు | inter-collegiate competitions from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైవీయూ అంతర్‌ కళాశాలల పోటీలు

Published Thu, Dec 22 2016 12:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM

inter-collegiate competitions from today

ప్రొద్దుటూరు కల్చరల్‌:     స్థానిక అనిబిసెంటు మున్సిపల్‌ హైస్కూల్‌లో యోగివేమన యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలను గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్‌ అనిబిసెంటు మున్సిపల్‌ హైస్కూల్‌క్రీడా మైదానంలో, టెన్నీస్‌ జార్జికారొనేషన్‌ క్లబ్, బ్యాడ్మింటన్‌ మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియంలో విద్యార్థులకు పోటీలు జరపనున్నారు. ఎస్‌సీఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో జరగనున్న  పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైవీయూ రిజిష్టార్‌ నజీర్‌ అహ్మద్‌ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సుబ్బిరెడ్డి తెలిపారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement