మద్యం మాయాజాలం | Corruption In Proddutur Liquor depot | Sakshi
Sakshi News home page

మద్యం మాయాజాలం

Published Mon, Mar 26 2018 12:13 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Corruption In Proddutur Liquor depot - Sakshi

డిపోలో మద్యం కేసులను మోస్తున్న హమాలీలు (ఇన్‌సెట్‌) కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ చేస్తున్న అధికారి కుమారుడు

ఆ అధికారి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. నేనే రాజు.. నేనే మంత్రి అనేలాడిపోలో ఆయన పాలన సాగిస్తున్నాడు. తనకుఎవరైనా అడ్డు తగిలితే బదిలీ చేయిస్తాడు.తన అవినీతి బాగోతం బయటికి పొక్కకుండాఉండేందుకని ముందు జాగ్రత్తగా ముఖ్యమైనవిభాగాల్లో కుటుంబ సభ్యులను ఏర్పాటుచేసుకున్నాడు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రొద్దుటూరులో పని చేస్తున్నఆ అధికారి అవినీతి తారా స్థాయికి చేరింది.

ప్రొద్దుటూరు క్రైం :గతంలో జిల్లా అంతటికి కడపలో మాత్రమే లిక్కర్‌ డిపో ఉండేది. మద్యం వ్యాపారుల సౌలభ్యం కోసం గత నవంబర్‌లో ప్రొద్దుటూరులో డిపోను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 134 మద్యం షాపులు, 12 బార్లు ఉన్నాయి.ఇందులో సుమారు 61 మంది హమాలీలు పని చేస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి 58 మందిని నియమించగా తర్వాత మరో ముగ్గురిని చేర్చుకున్నారు. నియామకాల సమయంలో కొందరి హమాలీల వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైదుకూరు రోడ్డులోని లింగాపురం సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు మద్యం డిపోకు వివిధ ప్రాంతాల నుంచి రోజు 10 లారీల లోడ్‌ వస్తుంది. ఒక్కో లారీలో 1275 కేసులు దాకా ఉంటాయి. లోడింగ్‌ సమయంలో సుమారు 15–20 సీసాలు దాకా డ్యామేజ్‌ అవుతాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే డిపోలోని అధి కారి మాత్రం 40–50 దాకా సీసాల బ్రే కేజీ అయినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్స్‌బర్గ్, సాబ్, యూబీ, బడ్‌వైజర్, టెన్‌ తౌజండ్‌ తదితర కంపెనీలకు చెం దిన ప్రతినిధులు (రెప్‌లు) డిపోలో ఉం టారు. బ్రేకేజీ ఎక్కువ ఎందుకు రాసుకుంటున్నారని అడ్డు చెప్పిన వారిపై అధికారి కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారి అవినీతి దందాను ప్రశ్నించినందుకు గాను కొం దరు కంపెనీ ప్రతినిధులను డిపో ఆవరణలోకి కూడా రానివ్వడం లేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. డిపోకు లారీ లోడ్‌ రాగానే ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని బ్రేకేజీ అయ్యాయో కంపెనీ రెప్‌లు నమోదు చేసుకోవాల్సి ఉంది. మద్యం సరుకు ఇన్‌వాయిస్‌ పరిశీలించి కంపెనీకి రోజు వారి సమాచారం పంపించాలి. అయితే 20 బాటిళ్లకు బదులు 50 పగిలి నట్లు రాసుకుంటూ అధికారి మాయాజాలం చేస్తున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 10 లారీల నుంచి సుమారు 12 కేసుల మద్యాన్ని సేకరించి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు డిపోలోని సిబ్బంది కొందరు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇందులో రూ.200 నుంచి రూ.2 వేల విలువ చేసే మద్యం సీసాలు ఉన్నా యి. వీటిని విక్రయించడం వల్ల ఆ అధి కారికి రోజు సుమారు రూ.40–50 వేలు ఆదాయం వస్తున్నట్లు సమాచారం.

కనిపించని సీసీ కెమెరాలు: ప్రొద్దుటూరు మద్యం డిపోలో రూ. కోట్ల విలువ చేసే మద్యం నిలువలు ఉన్నాయి. చిన్న దుకాణాలకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్న ఈ రోజుల్లో డిపోలో కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా ఏర్పాటు చేయకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. గోడౌన్‌లోని మద్యం సీసాల లెక్కింపులో తేడాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నం అవుతోంది. కావాలనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది.

అనధికారికంగా ఎవరూపని చేయడం లేదు..
 మా డిపోలో అనధికారికంగా ఎవరూ పని చేయడం లేదు. సీసీ కెమెరాల కోసం రాసి పంపించాం. ఎన్ని కెమెరాలు కావాలి.. ఎంత ఏరియా ఉందని ఉన్నతాధికారులు అడిగారు. ఇంకా కెమెరాలు రాలేదు. లారీ లోడ్‌లో మద్యం సీసాలు ఎన్ని బ్రేకేజీ అవుతాయో ఖచ్చితంగా చెప్పలేం. ఎన్ని పగిలితే అన్ని మాత్రమే స్కాన్‌ చేసి రాసుకుంటాం. ఎక్కువ బ్రేకేజీ రాసుకుంటామనడంలో వాస్తవం లేదు. అలా చేయడానికి అవకాశం ఉండదు. మద్యం కంపెనీల రెప్‌లు లోపలికి రాకూడదు. ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్లాలి. అవసరం ఉంటే మేమే పిలిపిస్తాం. వాళ్లు లోపలికి రావాలనే రూల్స్‌ పొజిషన్‌ ఏదీ లేదు. కాంపౌండ్‌లో స్టాఫ్, వర్కర్లు మాత్రమే ఉండాలి.     – చెన్నప్ప,ఇన్‌చార్జి డిపో మేనేజర్, ప్రొద్దుటూరు

అభ్యంతరం చెబితే వేధింపులు..
తన దందాకు అడ్డు వచ్చినా, అభ్యంతరం చెప్పినా వేధింపులు ఎదురౌతాయని సిబ్బంది అంటున్నారు. కృష్ణారావు అనే అధికారి నవంబర్‌ నుంచి స్టోర్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. మద్యం సీసాల బ్రేకేజీని ఎక్కవగా నమోదు చేయలేదనే కారణంతో డిపోబాస్‌ అతన్ని రోజు వేధింపులకు గురి చేసేవాడు.ఒత్తిడిని భరించలేక 15 రోజుల కిందట కృష్ణారావు బదిలీ చేయించుకొని వెళ్లిపోయాడు. రోజుకు ఎన్ని లారీలు వచ్చాయి.. ఎంత మేర డ్యామేజీ అయిందనే వివరాలను డిపోలోని కంప్యూటర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కీలకమైన ఈ విభాగంలోని పనులనుఅధికారి తన కుమారుడి ద్వారా చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్‌ విభాగంలో ఆపరేటర్‌ ఉన్నా అధికారి మాత్రం అనధికారికంగా తన కుమారుడిని నియమించుకున్నాడని వ్యాపారులు చెబుతున్నారు. కడప డిపోలో పని చేస్తున్న ఒక హమాలిని డిపో బాస్‌ ప్రొద్దుటూరుకు రప్పించుకున్నాడు. హమాలి పోస్టును ఇతరులకు రూ.8 లక్షలకు విక్రయించి అతన్ని ప్రొద్దుటూరులో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీపీపీలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ద్వారా హమాలీ ఉద్యోగానికి దరఖాస్తు చేయించి ఎంపికైన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఇతరులకు రూ. 4 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement