Liquor Depot
-
రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లిక్కర్ డిపోలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.90 కోట్ల విలువైన మద్యం నిల్వలు దగ్ధమైనట్లు డిపో మేనేజర్ ప్రభుదాస్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని డిపో అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్‌లోని తెలంగాణ రాష్ట్ర బ్రివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌బీసీఎల్) గోదాంలో 1985 నుంచి లిక్కర్ డిపో నిర్వహిస్తున్నారు. ఈ డిపో నుంచి ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ డిపోలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. కాసేపటికే మంటలు చెలరేగి మద్యం నిల్వలను చుట్టుముట్టాయి. మంటల ధాటికి లిక్కర్ బాటిళ్లు పేలిపోవడంతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. లిక్కర్లో ఉన్న స్పిరిట్ వల్ల మంటలు దావానలంలా వ్యాపించాయి. లోపలి నుంచి బాటిళ్లు పేలిపోయి పైకప్పురేకులను పగలగొట్టుకొని బయటకు వచ్చిపడ్డాయి. ఉట్నూర్‌కు సమీపంలో ఉన్న ఆరు అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అవి అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 50 వేల ఐఎంఎల్ కేసులు, 30 వేల బీర్ల కేసులు ఉన్నాయని, వీటి విలువ రూ.90 కోట్లు ఉంటుందని డిపో మేనేజర్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఎక్సైజ్ శాఖ విచారణ మొదలుపెట్టినట్టు తెలిసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి అధికారులు రానున్నారని సమాచారం. -
పైసా వసూల్..
ప్రొద్దుటూరు క్రైం :చేయి తడిపితేనే అక్కడ మద్యం కేసులు వాహనాల్లోకి వెళ్తాయి. లేదంటే మాత్రం వాహనంతో పడిగాపులు కాయాల్సిందే. డిపో అధికారులు ఒక రేటు నిర్ణయించి మద్యం షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ డబ్బు ఇవ్వకుంటే తమకు మద్యం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో డబ్బు ఇస్తున్నామని వారు అంటున్నారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో 134 మద్యం షాపులు ప్రొద్దుటూరు శివారులోని లింగాపురం సమీపంలో ఇటీవల కొత్తగా ఏఎంఎఫ్ఎల్ డిపో (లిక్కర్ డిపో)ను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులకు కడప ఎక్కువ దూరం అవుతుందనే ఉద్దేశంతో.. ప్రొద్దుటూరులో నూతనంగా లిక్కర్ డిపో ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో సుమారు 134 మద్యం షాపులు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపు నిర్వాహకులు వారంలో రెండు–మూడు సార్లు డిపో నుంచి స్టాకు తీసుకెళ్తారు. ఇలా నెలలో 10–12 సార్లు స్టాకు తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం వ్యాపారులు చలానా రూపంలో డబ్బు చెల్లించి సరుకు తెచ్చుకుంటారు. డబ్బు తీసుకోలేదు మద్యం డిపోలో ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని డిపో ఇన్చార్జి మేనేజన్ చెన్నప్ప అన్నారు. మద్యం కోసం యజమానులు ఎవ్వరూ రారని, ట్రాన్స్‌పోర్టు ద్వారా చలానా పంపిస్తారని ఆయన చెప్పారు. డబ్బు వసూలు చేయడం కోసం ఎవ్వరినీ నియమించలేదని పేర్కొన్నారు. ప్రారంభంలో డబ్బుఇవ్వబోమన్న వ్యాపారులు లిక్కర్ డిపో ప్రారంభంలో ఒక్కో చలానాకు రూ. 300 ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయగా మద్యం వ్యాపారులు ఇవ్వబోమని కరాఖండిగా చెప్పేశారు. అయితే తిరిగి మద్యం దుకాణదారులు సమావేశమై రూ.250 ఇచ్చేలా తీర్మానం చేసినట్లు తెలిసింది. కాగా వసూలు చేసిన డబ్బులో అధికారులతోపాటు ఎక్సైజ్ స్టేషన్లకు పంపిస్తున్నామని డిపోలోని ఒక అధికారి చెప్పడం గమనార్హం. ప్రత్యేక సిబ్బందిచే వసూలు తమకు దగ్గరలో మద్యం డిపో ఏర్పాటైందని, ఖర్చులు తగ్గుతాయని తొలుత వ్యాపారులు భావించారు. అయితే డిపోలోని అధికారుల ధన దాహానికి తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణ యజమానులు చెబుతున్నారు. అసలే అంతంత మాత్రంగా వ్యాపారాలు ఉన్నాయని, స్టాకు కోసం వెళ్లినప్పుడు డిపో సిబ్బంది అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో చలానాకు రూ. 250 కచ్చితంగా ఇవ్వాల్సిందేనని వారు అంటున్నారు. డబ్బు లేదంటే మాత్రం వారి వాహనాలకు స్టాకు ఎత్తరని, ఒక వేళ స్టాకు లోడ్ చేసినా తీవ్ర జాప్యం చేస్తారని వాపోతున్నారు. రెండు మూడు కేసుల మద్యం తీసుకున్నా రూ.250 చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఇలా నెలకు మద్యం షాపుల నుంచి రూ.4 లక్షలు పైగా వసూలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డబ్బు వసూలు కోసం అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. -
మద్యం మాయాజాలం
ఆ అధికారి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. నేనే రాజు.. నేనే మంత్రి అనేలాడిపోలో ఆయన పాలన సాగిస్తున్నాడు. తనకుఎవరైనా అడ్డు తగిలితే బదిలీ చేయిస్తాడు.తన అవినీతి బాగోతం బయటికి పొక్కకుండాఉండేందుకని ముందు జాగ్రత్తగా ముఖ్యమైనవిభాగాల్లో కుటుంబ సభ్యులను ఏర్పాటుచేసుకున్నాడు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రొద్దుటూరులో పని చేస్తున్నఆ అధికారి అవినీతి తారా స్థాయికి చేరింది. ప్రొద్దుటూరు క్రైం :గతంలో జిల్లా అంతటికి కడపలో మాత్రమే లిక్కర్ డిపో ఉండేది. మద్యం వ్యాపారుల సౌలభ్యం కోసం గత నవంబర్‌లో ప్రొద్దుటూరులో డిపోను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 134 మద్యం షాపులు, 12 బార్లు ఉన్నాయి.ఇందులో సుమారు 61 మంది హమాలీలు పని చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూలు నిర్వహించి 58 మందిని నియమించగా తర్వాత మరో ముగ్గురిని చేర్చుకున్నారు. నియామకాల సమయంలో కొందరి హమాలీల వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైదుకూరు రోడ్డులోని లింగాపురం సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు మద్యం డిపోకు వివిధ ప్రాంతాల నుంచి రోజు 10 లారీల లోడ్ వస్తుంది. ఒక్కో లారీలో 1275 కేసులు దాకా ఉంటాయి. లోడింగ్ సమయంలో సుమారు 15–20 సీసాలు దాకా డ్యామేజ్ అవుతాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే డిపోలోని అధి కారి మాత్రం 40–50 దాకా సీసాల బ్రే కేజీ అయినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్స్‌బర్గ్, సాబ్, యూబీ, బడ్వైజర్, టెన్ తౌజండ్ తదితర కంపెనీలకు చెం దిన ప్రతినిధులు (రెప్‌లు) డిపోలో ఉం టారు. బ్రేకేజీ ఎక్కువ ఎందుకు రాసుకుంటున్నారని అడ్డు చెప్పిన వారిపై అధికారి కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారి అవినీతి దందాను ప్రశ్నించినందుకు గాను కొం దరు కంపెనీ ప్రతినిధులను డిపో ఆవరణలోకి కూడా రానివ్వడం లేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. డిపోకు లారీ లోడ్ రాగానే ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని బ్రేకేజీ అయ్యాయో కంపెనీ రెప్‌లు నమోదు చేసుకోవాల్సి ఉంది. మద్యం సరుకు ఇన్వాయిస్ పరిశీలించి కంపెనీకి రోజు వారి సమాచారం పంపించాలి. అయితే 20 బాటిళ్లకు బదులు 50 పగిలి నట్లు రాసుకుంటూ అధికారి మాయాజాలం చేస్తున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 10 లారీల నుంచి సుమారు 12 కేసుల మద్యాన్ని సేకరించి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు డిపోలోని సిబ్బంది కొందరు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇందులో రూ.200 నుంచి రూ.2 వేల విలువ చేసే మద్యం సీసాలు ఉన్నా యి. వీటిని విక్రయించడం వల్ల ఆ అధి కారికి రోజు సుమారు రూ.40–50 వేలు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కనిపించని సీసీ కెమెరాలు: ప్రొద్దుటూరు మద్యం డిపోలో రూ. కోట్ల విలువ చేసే మద్యం నిలువలు ఉన్నాయి. చిన్న దుకాణాలకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్న ఈ రోజుల్లో డిపోలో కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా ఏర్పాటు చేయకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. గోడౌన్‌లోని మద్యం సీసాల లెక్కింపులో తేడాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నం అవుతోంది. కావాలనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా ఎవరూపని చేయడం లేదు.. మా డిపోలో అనధికారికంగా ఎవరూ పని చేయడం లేదు. సీసీ కెమెరాల కోసం రాసి పంపించాం. ఎన్ని కెమెరాలు కావాలి.. ఎంత ఏరియా ఉందని ఉన్నతాధికారులు అడిగారు. ఇంకా కెమెరాలు రాలేదు. లారీ లోడ్‌లో మద్యం సీసాలు ఎన్ని బ్రేకేజీ అవుతాయో ఖచ్చితంగా చెప్పలేం. ఎన్ని పగిలితే అన్ని మాత్రమే స్కాన్ చేసి రాసుకుంటాం. ఎక్కువ బ్రేకేజీ రాసుకుంటామనడంలో వాస్తవం లేదు. అలా చేయడానికి అవకాశం ఉండదు. మద్యం కంపెనీల రెప్‌లు లోపలికి రాకూడదు. ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్లాలి. అవసరం ఉంటే మేమే పిలిపిస్తాం. వాళ్లు లోపలికి రావాలనే రూల్స్ పొజిషన్ ఏదీ లేదు. కాంపౌండ్‌లో స్టాఫ్, వర్కర్లు మాత్రమే ఉండాలి. – చెన్నప్ప,ఇన్చార్జి డిపో మేనేజర్, ప్రొద్దుటూరు అభ్యంతరం చెబితే వేధింపులు.. తన దందాకు అడ్డు వచ్చినా, అభ్యంతరం చెప్పినా వేధింపులు ఎదురౌతాయని సిబ్బంది అంటున్నారు. కృష్ణారావు అనే అధికారి నవంబర్ నుంచి స్టోర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. మద్యం సీసాల బ్రేకేజీని ఎక్కవగా నమోదు చేయలేదనే కారణంతో డిపోబాస్ అతన్ని రోజు వేధింపులకు గురి చేసేవాడు.ఒత్తిడిని భరించలేక 15 రోజుల కిందట కృష్ణారావు బదిలీ చేయించుకొని వెళ్లిపోయాడు. రోజుకు ఎన్ని లారీలు వచ్చాయి.. ఎంత మేర డ్యామేజీ అయిందనే వివరాలను డిపోలోని కంప్యూటర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కీలకమైన ఈ విభాగంలోని పనులనుఅధికారి తన కుమారుడి ద్వారా చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ విభాగంలో ఆపరేటర్ ఉన్నా అధికారి మాత్రం అనధికారికంగా తన కుమారుడిని నియమించుకున్నాడని వ్యాపారులు చెబుతున్నారు. కడప డిపోలో పని చేస్తున్న ఒక హమాలిని డిపో బాస్ ప్రొద్దుటూరుకు రప్పించుకున్నాడు. హమాలి పోస్టును ఇతరులకు రూ.8 లక్షలకు విక్రయించి అతన్ని ప్రొద్దుటూరులో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీపీపీలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ద్వారా హమాలీ ఉద్యోగానికి దరఖాస్తు చేయించి ఎంపికైన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఇతరులకు రూ. 4 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రెండో మద్యం డిపో ప్రారంభానికి బాలారిష్టాలు
హమాలీల నియామకం విషయంలో వివాదం వెనుదిరిగిన మద్యం లారీలు పండగ అనంతరం సన్నాహాలు నెల్లూరు(క్రైమ్): గూడూరు ఎక్సైజ్ జిల్లాలో రెండో మద్యం డిపో నిర్మాణం పూర్తయింది. ఈనెల మొదటివారంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హమాలీల నియామక విషయంలో వివాదం చెలరేగడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో డిపోకు వచ్చిన 30 లారీల మద్యం దేవరపాలెం ఐఎంఎల్ డిపోకు తరలింది. జిల్లాలో 336 మద్యం దుకాణాలు 42 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ నెల్లూరు ఎౖMð్సజ్ జిల్లా పరిధిలోని దేవరపాలెం ఐఎంఎల్ డిపో నుంచే మద్యం, బీరు సరఫరా అవుతోంది. గూడూరు సబ్‌డివిజన్ పరిధిలోని తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి నుంచే మద్యం ఏన్నోఏళ్లుగా తీసుకెళుతున్నారు. కొంతకాలంగా ఖర్చు అధికమవుతుండటం వ్యాపారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని ఓజిలిలో రెండో మద్యం డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 141 మద్యం దుకాణాలకు సరఫరా గూడూరు జిల్లాలోని 141 మద్యం దుకాణాలకు, నాలుగుబార్లకు ఓజిలి నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేశారు. 30 లారీల మద్యాన్ని సైతం తెప్పించారు. అయితే హమాలీల నియామక విషయంలో నెలకొన్న వివాదంతో ప్రారంభానికి బ్రేక్ పడింది. దీంతో మద్యాన్ని దేవరపాలెంలోని డిపోకు తరలించారు. డిపోలో పనిచేసేందుకు çసుమారు 80మంది లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు హమాలీలు అవసరం. హమాలీల నియామకాల్లో 80శాతం స్థానికులకు, 20శాతం స్థానికేతరులకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో హమాలీల నియామక బాధ్యతలు జేసీ చేపట్టారు. పదోతరగతి ఉత్తీర్ణులై, 40 ఏళ్లలోపు వారినే నియమించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికేతరులకు ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం కల్పించరాదని, తమనే నియమించాలని, అధికారపార్టీ నేతలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో డిపో ప్రారంభానికి నోచుకోలేదు. గత కొద్దిరోజులుగా అధికారులు, కార్మిక నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం డిపోను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావును వివరణ కోరగా హమాలీల నియామకం విషయంలో కొంత సమస్య ఉందని అది త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. పండగ అనంతరం డిపోను ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. -
బాటిల్ పగిలితే పండగే..
• డ్యామేజ్ పేరిట ఐఎంఎల్ డిపోలో దోపిడీ • పగిలేది తక్కువ....చూపించేది ఎక్కువ • వైరా మద్యం డిపోలో సిబ్బంది చేతివాటం వైరా: మద్యం డిపోలో ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైరా ఐఎంఎల్ డిపోలో తక్కువ డ్యామేజ్‌ను ఎక్కువగా చూపి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వైరా డిపో నుంచి జిల్లా వ్యాప్తంగా బార్లు, వైన్స్‌కు మద్యం సరఫరా చేస్తుంటారు. వివిధ మద్యం కంపెనీల సరఫరాదారుల ద్వారా వచ్చిన మద్యాన్ని డిపోల్లో నిల్వ ఉంచుతారు. మద్యం సరఫరాకు సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్ సమయంలో కొంత మేర డ్యామేజ్ కావడం సహజం. పగిలిన బాటిళ్లను డ్యామేజ్‌ను లాస్ కింద చూపించడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డ్యామేజ్‌ను ఎక్కువగా చూపుతున్నారు. ఈ తతంగం చాలాకాలం నుంచి జరుగుతోంది. ఒకటికి....రెండు లెక్క... డిపోలో ఒక బాటిల్ పగిలితే రెండు లెక్క రాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మామూలుగా ఐదు బాక్సుల(కాటన్లు) లిక్కర్, బీర్ డ్యామేజ్ అయితే 10 బాక్సులు డ్యామేజ్ అయినట్లు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పగిలిన సీసాల పేరు చెప్పి మిగుల్చుకున్న మద్యం బాటిళ్లను తమకు తెలిసిన వారు నిర్వహించే బార్లు, వైన్స్ షాపులకు సరాసరి ధరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యామేజ్ అయిన సరుకుకు అధికారికంగా ఎలాంటి బిల్లులూ ఉండకపోవడం వీరి తెరచాటు వ్యవహారానికి దోహదపడుతోంది. డిపోలో ధర కన్నా తక్కువకు కొందరు డిపో సిబ్బంది సరుకు బయటకిస్తుండటంతో వైన్స్ యజమానులు వాటిపై మక్కువ చూపుతున్నారని వినికిడి. ఈ విధంగా వచ్చిన రోజువారీ ఆదాయం తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా పంపిణీ జరుగుతుంది. ప్రతిరోజూ రూ.వేలల్లో ఆదాయం ఐఎంఎల్ డిపోలకు రోజు వారీగా పదుల సంఖ్యలో లారీలు మద్యాన్ని తీసుకొస్తుంటాయి. ఇక్కడి నుంచి తిరిగి రెండు జిల్లాల్లోని వైన్స్‌లు, బార్ షాపులకు అదేస్థాయిలో వెళ్తుంటాయి. ఒక్కో లారీలో తక్కువలో తక్కువ రెండు మూడు బాక్సులైనా పగిలినట్లుగా ఇక్కడి సిబ్బంది చూపుతున్నట్లు సమాచారం. రవాణా సమయంలో డ్యామేజ్ అయితే సదరు కంపెనీ వారే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. రోజుకు డిపోలో పది నుంచి పదిహేను బాక్సులనైనా డ్యామేజ్ కింద చూపుతారని తెలుస్తోంది. ఓ కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిళ్ల మద్యం ఒక్కో బాక్సు ధర వైన్స్ షాపులో పెరిగిన ధరల ప్రకారం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యలో ఉంటుంది. ఒక రోజు ఈ కంపెనీకి చెందిన కనీసం ఐదు బాక్సులు డ్యామేజ్ చూపితే ఒక్కో బాక్సుకు రూ.2 వేల చొప్పున ఐదు బాక్సులకు సుమారుగా రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇక్కడి విధులకు పోటీ ఎక్కువ వైరాలోని ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఇష్టపడతారు. ఇక్కడ పనిచేస్తే వేతనంతో పాటు చేతి నిండా ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్సైజ్ వారు ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు పోటీ పడతారని సమాచారం. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి మరీ పోస్టింగ్‌లు వేయించుకుంటారు. ఇక్కడ పని చేస్తున్న కొద్ది మంది అధికారులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వారికి బదిలీలు కూడా లేవు. అంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
ఇందూరు టు మహారాష్ట్రకు కల్తీకల్లు!
♦ సరిహద్దులో తిష్టవేసిన ‘బాసర బ్యాచ్’ ♦ ‘మిషన్ బాసర’తో జిల్లాకు ‘మాఫియా’ ♦ యంచలో రూ.12 లక్షలకు డిపో కొనుగోలు ♦ రైలుమార్గంలో భారీగా కల్తీ కల్లు రవాణా ♦ ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి సరఫరా ♦ ఎక్సైజ్, పోలీసుశాఖల మౌనం జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది.. జిల్లాలో విక్రయాలు చాలవన్నట్లు మహారాష్ర్ట నుంచి రైళ్లలో కల్లు ముడిసరుకులు తెప్పించుకుంటూ.. మళ్లీ మహారాష్ర్టకు కల్లు సరఫరా చేస్తున్నారు. బాసర బ్యాచ్‌గా పిలవబడే ఈ కల్లు మాఫియాను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా యంచలో రూ.12 లక్షలతో డిపోను కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి కల్లీ కల్లు సరఫరా అవుతోంది.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కల్తీ కల్లు చిమ్ముతున్న విషానికి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా.. అధికారులు కళ్లు తెరవడం లేదు. కల్తీకల్లు రహిత జిల్లాగా మారుస్తామంటున్న ఎక్సైజ్‌శాఖ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో నవీపేట మండలం యంచ, ఫకీరాబాద్, నాగేపూర్లలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీకల్లు తయారీని పట్టించుకోవడం లేదు. ‘మిషన్ బాసర’తో అక్కడ దందాను వదిలి.. కల్లు దందాలో ఆరితేరిన ‘బాసర బ్యాచ్’ రూ.12 లక్షలకు యంచలో డిపోను కొనుగోలు చేసింది. యంచ కల్లు డిపో కేంద్రంగా నిషేధిత మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి ప్యాకెట్ల రూపేణా రోజుకు వేల లీటర్లు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. యంచతోపాటు ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి తరలుతున్న కల్లీ కల్లు ఫకీరాబాద్ తోపాటు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే బాసర రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ర్టకు తరలుతుంది. యంచ డిపోను కొనుగోలు చేసి దందా నడిపిస్తున్న నిర్వాహకుని తండ్రిని ఐదు కిలోల క్లోరల్ హైడ్రేడ్, 25 కిలోల కల్లు తయారీకి ఉపయోగించే ఇతర ముడి సరుకులను పట్టుకున్న ఆబ్కారీశాఖ అధికారులు.. ఆ తర్వాత అటువైపు చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నాలుగు నెలలుగా జిల్లాకు చెందిన మరో ఇద్దరిని కలుపుకుని ‘బాసర బ్యాచ్’ కొనసాగిస్తున్న కల్లుదందా రూ.లక్షలు కురిపిస్తుండగా.. పోలీసు, ఎక్సైజ్‌శాఖలు మౌనం వహించడం చర్చనీయాంశం అవుతోంది. ‘మిషన్ బాసర’తోజిల్లాలో కల్లు మాఫియా తిష్ట ఆదిలాబాద్ జిల్లా బాసర కేంద్రంగా కల్తీకల్లు దందా నిర్వహించి రూ.కోట్లు గడించిన కల్లు మాఫియా జిల్లాలో మకాం వేసింది. సుమారు ఐదు మాసాల క్రితం బాసరకు చెందిన యువత, సామాజిక కార్యకర్తలు సరస్వతి దేవి కొలువున్న చోట కల్తీ కల్లు, మద్యం విక్రయాలు చేయరాదంటూ ‘మిషన్ బాసర’కు శ్రీకారం చుట్టాయి. కల్తీకల్లు దందా సర్వస్వంగా మారిన ‘బాసర బ్యాచ్’ జిల్లాలోని నవీపేట మండలం యంచ డిపోను రూ.12 లక్షలు స్థానిక నిర్వాహకులకు చెల్లించి హస్తగతం చేసుకుంది. పాత పద్ధతిలోనే మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి నవీపేట మండలం యంచ, ఫకీరాబాద్లకు కల్లు తయారీకి ఉపయోగించే మత్తు పదార్థాలు తెచ్చుకుంటున్నా పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. క్రిమి సంహారక మందుల తయారీకి ఉపయోగించే రసాయనాలను ధర్మాబాద్ నుంచి కొనుగోలు చేసి కల్తీ కల్లు తయారు చేస్తూ.. తిరిగి ప్రాంతాలకే సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాంలు (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కోసం), కుంకుడు కాయల రసం(నురుగు కోసం)లు కలిపి కల్లు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇంతగా కల్తీకల్లు తయారీ, విక్రయాల దందా సాగుతుంటే ఎకై ్సజ్ అధికారులు మాత్రం గోల్లుగిల్లుకుంటున్నారు. పేదల పాలిట కాలయముల్లా తయారైన కల్తీ కల్లు వ్యాపారులంటే అధికార యంత్రాంగానికి అపారమైన ప్రేమ ఉంటుంది. ‘‘ఒత్తిడి ఎక్కువైతే అప్పుడప్పుడు కల్లును ఒలకబోస్తారే తప్పా.. వారిపై ప్రేమ ఒలకబోయకుండా ఉండరన్న’’ విమర్శలు ఉన్నాయి. ఇదిలా వుంటే ధర్మాబాద్ నుంచి మత్తు పదార్థాలు తెచ్చి యంచ, ఫకీరాబాద్, నాగేపూర్లు కేంద్రంగా కల్తీ కల్లు తయారు చేస్తున్న నిర్వాహకులు రైలుమార్గం ద్వారా మహారాష్ర్టలోని పల్లెలకు సరఫరా చేస్తున్నా ఎకై ్సజ్, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. కల్లు మాఫియాకు వరంగా రైలుమార్గం బాసరలో కల్లు దందా జోరుగా నిర్వహించిన కల్లు మాఫియా ఇప్పుడు జిల్లా సరిహద్దులో మకాం వేయగా.. అప్పుడు, ఇప్పుడు మహారాష్ట్ర పేద మహిళలే ‘బాసర బ్యాచ్’కు టార్గెట్. ‘తక్కువ ధర’ పేరిట కల్లు ప్యాకెట్లను తయారు చేసి మహిళలతో ఈ ప్యాకెట్లను మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. రైలుమార్గం ఈ కల్లు మాఫియాగా వరంగా మారింది. యంచతోపాటు ఫకీరాబాద్, నాగేపూర్ గ్రామాలలోని కల్లు బట్టీల నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, ముద్కెడ్, జల్నా తదితర ప్రాంతాలకు కల్లు సరఫరా అవుతుంది. ఫకీరాబాద్ రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది. ఈ రైళ్లలోనే సరఫరా ముఠాలు కల్లును సరఫరా చేస్తున్నాయి. యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు రైళ్లలో ఇక్కడ దిగి, ప్యాకెట్లలో కల్లును నింపుకుని మళ్లీ మరొక రైలులో వెళ్తున్నారు. ఈ స్టేషన్ మీదుగా అయిదు ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీరి కోసం కల్లు బట్టీలలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. రైలు ఆగిందంటే వీరి రాక కోసం కల్లు బట్టీల నిర్వాహకులు ఎదురుచూస్తారు. ఒక్కో వ్యక్తికి 30 నుంచి 50 ప్యాకెట్లను ఇచ్చి వారికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు గిట్టుబాటు కలిగేలా వ్యాపారులు చూసుకుంటున్నారు. ‘బాసర బ్యాచ్’కు అందరినీ కలుపుకుని ఈ దందా సాగిస్తుండగా యంచ, ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి రోజుకు పెద్ద ఎత్తున మహారాష్ర్టకు కల్తీ కల్లు రవాణా అవుతోంది. కల్లు డిపోలపై ప్రత్యేక బృందాల దాడి శాంపిల్స్ సేకరించిన అధికారులు నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కల్లు డిపోలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు నిర్వహిం చాయి. డిపోలో తయారైన కల్లు శాంపిళ్లను సేకరించాయి. కల్తీ కల్లు నివారణ చర్యల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు ఈఎస్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశా రు. నిజామాబాద్‌కు చెందిన సిబ్బంది కా ్జజీండా ఆర్మూర్, మోర్తాడ్ స్టేషన్లకు చెందిన ఎక్సైజ్ సిబ్బందితో ఈ దాడులు చేయిం చడం విశేషం. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నిజామాబాద్ మండలం గూపన్పల్లి, మాధవనగర్, బోర్గాం (పీ) కల్లు డిపోలపై ఈ దాడులు జరిగాయి. ఆయా డిపోల్లో తయారైన కల్లు శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. నిజామాబాద్ నగరంలో ఒకటి, రెండో కల్లు డిపోల లెసైన్స్‌లు రద్దు కావటంతో కల్లు ప్రియులు నిజామాబాద్ నగర ం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కల్లు సేవించడమే కాకుండా, ఇంటికి ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నారు. దాంతో ఆయా కల్లు డిపోలు అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, డిపో నిర్వాహకులు కల్లును మరింత ఎక్కువ తయారు చేసి విక్రయించేందుకు కల్లులో ఏమైనా మత్తుపదార్థాలు కలుపుతున్నారా అన్న అనుమానంతో ఇన్చార్జి డీసీ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో తనిఖీలు చేయించారు. డిపోలలో తయారైన కల్లు శాంపిల్స్‌ను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపారు. కల్లులో ఏమైనా మత్తు పదార్థా లు కలిపినట్లుగా పరీక్షల్లో తేలితే నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. -
మద్యం డిపో వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనిట్ ముందు లారీ డ్రైవర్లు శుక్రవారం నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడి యూనిట్‌కు సరఫరా జరుగుతోంది. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలను రోడ్డుపై నిలపడానికి పోలీసులు అనుమతించడం లేదు. అదే సమయంలో డిపోలోకి రావడానికి అధికారులు ఒప్పుకోవడం లేదు. వీరి వైఖరికి నిరసనగా సుమారు 50 లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో మద్యం డిపో అధికారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. -
ఎక్సైజ్ ఏసీ సోదరుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్ : చాగల్లు మద్యం డిపోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఆదిశేషుపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో స్థానిక బడేటివారి వీధిలో నివాసముంటున్న ఆయన సోదరుడు మామిళ్లపల్లి పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఆదిశేషు చాగల్లు డిపోలో బాధ్యతలు స్వీకరించక ముందు గుంటూరులో పనిచేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సుమారు 8 నెలలుగా ఆయన కుంటుంబం, బంధువులు, స్నేహితులపై ప్రత్యేక నిఘా ఉంచిన ఏసీబీ సెంట్రల్ సెల్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఆయన బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఆదిశేషు బంధువులు ఏలూరులో నివాసం ఉన్నారని గుర్తించిన అధికారులు పార్థసారథి ఇంట్లో సోదాలు చేశారు. నిందితునికి బినామీగా భావిస్తున్న ఆయన ఇంట్లో స్థిరాస్థులకు సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. చాగల్లు డిపోలోనూ.. చాగల్లు: చాగల్లులోని మద్యం డిపోలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒంగోలు ఏసీబీ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము వచ్చిన బందం మధ్యాహ్నం రెండు గంటల వరకు సోదాలు చేసింది. విజయవాడలో నివసిస్తున్న అదిశేషు ఇంట్లో, అతని బందువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. చాగల్లు డిపోలో మధ్యం నిల్వలు, ఆయన కార్యాలయూన్ని ఏసీబీ అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. డిపో సిబ్బందిని, హమాలీలను బయటికి పంపించేశారు. సోదాలతో డిపో నుంచి మద్యం కేసులు డెలివరీ నిలిచిపోరుుంది. దీంతో మద్యం వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సీఐ ప్రతాప్ మాట్లాడుతూ అదిశేషుకు విజయవాడలో ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అతనిపై కేసు నమోదైందని చెప్పారు. చాగల్లు డిపోలో చేసిన తనిఖీల్లో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించలేదని చెప్పారు. అదిశేషు మూడు నెలల క్రితం బదిలీపై చాగల్లు డిపోకు వచ్చారు. -
సీజ్..స్టే
నల్లగొండ : కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లాలోని మద్యం డిపోలను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేయడం ...సాయంత్రానికి డిపోలను సీజ్ చేయడంపై హైకోర్టు స్టే ఇవ్వడం తదితర పరిణామాలన్నీ చకాచకా జరిగిపోయాయి. ఆదాయ పన్ను బకాయిలు రాబట్టుకునే విషయమై కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మద్యం డిపోలను సీజ్ చేసిన ఐటీ అధికారులు బుధవారం మన జిల్లాలోకి ప్రవేశించారు. ఆదాయ పన్ను శాఖ దాడుల గురించి కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి జిల్లాలోని లిక్కర్ డిపోలకు సమాచారం చేరింది. దీంతో ఐటీ దాడులు ఏ క్షణంలో అయినా జరుగుతాయని భావించిన మద్యం వ్యాపారులు ముందుగానే అప్రమత్తమై భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 3 తేదీ వరకు రూ.20.95 కోట్ల మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం కూడా భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు డిపోలకు చేరుకున్నారు. కానీ అదే సమయానికి ఐటీ అధికారులు డిపోల్లోకి ప్రవేశించడంతో మద్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిపేశారు. నల్లగొండ డిపోలో బుధవారం మద్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రూ.3 కోట్లు చలానా ప్రభుత్వా ఖజనాకు జమ చేశారు. కానీ అప్పటికే ఐటీ అధికారులు డిపోనకు చేరుకోవడం.. సీజ్ చేయడం వంటి పరిణామాలన్నీ చకాచకా జరిగిపోయాయి. నల్లగొండ డిపోలో బుధవారం ఉదయం వరకు రూ.12 కోట్ల స్టాక్ ఉంది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం బోగారం వద్ద ఉన్న నల్లగొండ-2 కూడా ఐటీ అధికాారులు సీజ్ చేశారు. నల్లగొండ డిపో నుంచి బయల్దేరి వెళ్లిన ఐటీ అధికారులు బోగారం నల్లగొండ డిపో- 2కు సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. ఈ డిపోలో బుధవారం రూ.2.38 కోట్ల లిక్కర్ కొనుగోళ్లు జరిగాయి. డిపో ముగిసే సమయానికి ఐటీ అధికారులు చేరుకోవడంతో ఇక్కడి వ్యాపారులు సులువుగా బయటపడ్డారు. ఇదిలావుంటే రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో డిపోలు మూసివేయడంతో అక్కడి వ్యాపారులకు అవసరమయ్యే మద్యాన్ని నల్లగొండ జి ల్లాలో కొనుగోలు చేసుకునే విధంగా మంగళవారం ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో అక్కడి వ్యాపారులు బుధవారం మన జిల్లాలో మద్యాన్ని కొనుగోలు చేసేందుకు చలానాలు కూడా కట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆ రెండు జి ల్లాల వ్యాపారులు ఇక్కడి మద్యాన్ని కొనుగోలు చేయలేదు. వ్యాపారుల ఎత్తు..చిత్తు... ఐటీ దాడుల నేపథ్యంలో కొద్దిరోజులనుంచి భారీ స్థాయిలో లిక్కర్ కొనుగోలు చేసిన వ్యాపారులు ఆ స్టాక్ మొత్తాన్ని బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. వ్యాపారులు దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డు తగిలించేందుకు సిద్ధమయ్యారు. 5, 6 తేదీల్లో హోలీ సంబరాల నేపథ్యంలో మద్యాన్ని బ్లాక్ చేసి ఏమ్మార్పీకి మించి అమ్మకాలు చే యాలని వ్యూహం పన్నారు. సాయంత్రానికే హైకోర్టు స్టే విధించడంతో వ్యాపారుల ఎత్తు కాస్త చిత్తయ్యింది. -
హోలీకి మద్యం ఓకే!
- డిపో మూసివేతతో నిలిచిన రూ.18కోట్ల సరుకు రవాణా - నేడు తెరుచుకోనున్న మద్యం డిపో - గురువారం నుంచి డీలర్లకు సరుకు సరఫరా సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎక్సైజ్ శాఖకు, మందుబాబులకు ఊరట లభించింది. ఆదాయ పన్ను చెల్లింపుల అంశంలో తలెత్తిన వివాదంతో రాష్ట్రంలోని మద్యం డిపోలకు తాళం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని బ్రేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన డిపో రెండ్రోజులుగా మూతబడింది. ఫలితంగా డీలర్లకు మద్యం సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా డీలర్ల వద్ద స్టాకు నిండుకోవడం.. మరోవైపు హోలీ పండగ నేపథ్యంలో ఎక్సైజు శాఖకు భారీగా నష్టం తప్పదని భావించగా.. బుధవారం ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో ఊపిరిపీల్చుకున్నట్లైంది. దీంతో జిల్లాలోని మద్యం డీలర్ల వద్ద సరుకు అయిపోవడంతో గురువారం తిరిగి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం విక్రయాలు జిల్లాలో నమోదవుతున్నాయి. సగటున రాష్ట్ర ఆదాయంలో 30శాతం రెవెన్యూ జిల్లానుంచే ఖజానాకు చేరుతోంది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా డిపోకు తాళం పడడంతో సరుకు డిపో గేటు దాటలేదు. ప్రస్తుతం జిల్లాలో 350 వరకు మద్యం దుకాణాలున్నాయి. ఇవికాకుండా మరో 250 బార్లు నడుస్తున్నాయి. వీటిద్వారా నెలకు సగటున రూ.165 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమఅవుతోంది. ఈ లెక్కన రోజుకు రూ.6 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. తాజాగా ఆదాయపుపన్ను చెల్లింపుల విషయమై మద్యం డిపో మూతబడింది. ఫలితంగా మూడురోజులుగా జిల్లాలో దాదాపు రూ.18 కోట్ల విలువైన స్టాకు సరఫరా నిలిచిపోయింది. తాజాగా డిపో తెరిచేందుకు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విక్రయాలు జరిగినప్పటికీ వాటివల్ల వచ్చే నగదుపై మాత్రం ఆంక్షలు పెట్టింది. ఈనెల 10న చేపట్టే విచారణ అనంతర పరిణామాలతో ముడిపెట్టింది. -
మద్యం డిపో మూసివేత
చాగల్లు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో చాగల్లు శివారులోని ఏపీబీసీఎల్ మద్యం డిపోను మంగళవారం అర్ధరాత్రి నుంచి మూసివేసినట్టు డిపో మేనేజర్ వి.రామారావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిపోను మూసివేసినట్టు చెప్పారు. ఈనెల 24వ తేదీలోగా డీడీలు తీసిన మద్యం లెసైన్స్దారులందరికీ మంగళవారం వరకు మద్యం సరఫరా చేసినట్టు తెలిపారు. ఈనెలలో రూ.48 కోట్లు లావాదేవీలు జరిగినట్టు చెప్పారు. మరలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి డిపోను తెరుస్తామన్నారు. ఆఖరి రోజు అధిక సంఖ్యలో లెసైన్సుదారులు మద్యం కోసం క్యూ కట్టారు.