రాష్ట్ర విభజన నేపథ్యంలో చాగల్లు శివారులోని ఏపీబీసీఎల్ మద్యం డిపోను మంగళవారం అర్ధరాత్రి నుంచి మూసివేసినట్టు డిపో మేనేజర్ వి.రామారావు తెలిపారు.
చాగల్లు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో చాగల్లు శివారులోని ఏపీబీసీఎల్ మద్యం డిపోను మంగళవారం అర్ధరాత్రి నుంచి మూసివేసినట్టు డిపో మేనేజర్ వి.రామారావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిపోను మూసివేసినట్టు చెప్పారు. ఈనెల 24వ తేదీలోగా డీడీలు తీసిన మద్యం లెసైన్స్‌దారులందరికీ మంగళవారం వరకు మద్యం సరఫరా చేసినట్టు తెలిపారు. ఈనెలలో రూ.48 కోట్లు లావాదేవీలు జరిగినట్టు చెప్పారు. మరలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి డిపోను తెరుస్తామన్నారు. ఆఖరి రోజు అధిక సంఖ్యలో లెసైన్సుదారులు మద్యం కోసం క్యూ కట్టారు.