ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టిన ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి.
బి.కోడూరు: వైఎస్‌ఆర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కాశీనాయన మండలం వంకమర్రి బ్రిడ్జి వద‍్ద సోమవారం వేకువజామున చోటు చేసుకున్న్ ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇందు ట్రావెల్స్ బస్సులో వేంపల‍్లె నుంచి గుడివాడలోని కేకే గౌతమ్ స్కూల్‌కు వెళ్తుంతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగినపుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన‍్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను పోరుమామిళ‍్ల ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. గాయపడినవారిలో ఇద‍్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వారిని కడప రిమ్స్ ఆస‍్పత్రికి తరలించారు.