– రోడ్డును పగులగొట్టి రాత్రికి రాత్రి కాలువ నిర్మాణం
– అయినా చలనం లేని మున్సిపల్ అధికారులు
ప్రొద్దుటూరు టౌన్ : పట్టణంలోని కోనేటికాలువ వీధిలోని 40 అడుగుల మున్సిపాలిటీ రోడ్డును సోమవారం అర్ధరాత్రి పగుల గొట్టారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులే లేరు. మంగళవారం అర్ధరాత్రి తిరిగి కాలువను నిర్మించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డును పగుల గొట్టింది ఎవరు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, తిరిగి కాలువను నిర్మించినా అధికారులు ఎందుకు పట్టించు కోలేదు అన్న విషయంపై మున్సిపల్ అధికారులు మాకు తెలియదంటే మాకు తెలియదని చేతులు దులుపుకుంటున్నారు. మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బంగారురెడ్డి ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేదు.
ఎందుకీ నిర్లక్ష్యం...
కాలువలో నీరు వెల్లలేదని రూ.లక్షల వెచ్చించి నిర్మించిన రోడ్డును ద్వంసం చేసినా కూడా అధికారుల్లో చలనం లేదంటే పరిస్థితి అర్థం కావడంలేదు. రోడ్డును పగులగొట్టడం ద్వారా భారీ వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే రోడ్డు కృంగిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాల్లు పగులగొడుతుంటే ఎలా అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బిల్లులు కూడా కాని రోడ్డును పగుల కొట్టిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పట్టించుకునే దిక్కులేదు
Published Tue, May 2 2017 5:09 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement