సాక్షి,వైఎస్‌ఆర్‌జిల్లా : ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గాంధీ రోడ్డు సమీపంలోని బీజీఆర్ లాడ్జిలో హత్య జరిగింది. మద్యం సీసాతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తిని రౌడీ షీటర్ పప్పిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్యలో స్థానిక టీడీపీ నేతల సోదరుల ప్రమేయం ఉందని సమాచారం. హత్య జరిగిన లాడ్జి రూమ్ టీడీపీ నాయకుడు యనమల సుబ్బిరెడ్డి సోదరుని అధీనంలోనే కొన్ని నెలలుగా ఉన్నట్లు సమాచారం.
మరో టీడీపీ నేత ముక్తియర్ సోదరుడు ముజీబ్ కూడా ఆ రూంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముజీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment