
నిందితుల ఫొటో
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మిట్టమడివీధిలో ఇందిరాదేవి అనే మహిళ మెడలో నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు ఇందిరాదేవి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కొని పారిపోయారు. ముందు వైపు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గట్టిగా కేకలు వేయగా నిందితులు బైక్‌లో పారిపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు.
నిందితుల ఫొటో విడుదల చేసిన పోలీసులు
మిట్టమడివీధిలో సీసీ కెమెరా ఉండటంతో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పరిశీలించిన పోలీసులు నిందితుల ఫొటోను పత్రికలకు విడుదల చేశారు. వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. ఇక్కడ చైన్ స్నాచింగ్‌కు పాల్ప డ్డ వారు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు చేసే అవకాశం ఉందని సీఐ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment