ప్రొద్దుటూరు సభ: సీఎం జగన్‌ ప్రసంగంలో హైలెట్స్‌ | YSRCP Memantha Siddham Bus Yatra: CM YS Jagan Proddatur Public Meeting Full Speech Highlights Inside - Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరు సభ: సీఎం జగన్‌ ప్రసంగంలో హైలెట్స్‌

Published Wed, Mar 27 2024 5:11 PM | Last Updated on Thu, Mar 28 2024 11:57 AM

CM YS Jagan Proddatur Public Meeting Full Speech - Sakshi

AP CM YS Jagan Public Meeting at Proddatur Updates

ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ ప్రసంగం

మన టార్గెట్‌ 175కి 175 అసెంబ్లీ సీట్లు.. 25 పార్లమెంట్‌ సీట్లు
మే 13న వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి
అందరి బాగు కోసం రెండుసార్లు ఫ్యాన్‌పై నొక్కండి

  • మీ ఇంటికి రేషన్‌ రావాలంటే జగన్‌ రావాలి
  • జగనన్న మీ కోసం 130 సార్లు బటన్‌ నొక్కాడు
  • పేదల కోసం, మన కోసం రెండు బటన్‌లు జగనన్న కోసం నొక్కాలి
  • ప్రతీ ఇంటికి సంక్షేమం అందాలంటే జగనన్నే సీఎం కావాలి
  • ఫ్యాన్‌ మీద బటన్‌ నొక్కితే.. గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు
  • చంద్రబాబును నమ్మడం అంటే.. పథకాలను మనం రద్దు చేసుకోవడమే
     

నా చెల్లెల్ని తెచ్చుకున్నారు: సీఎం జగన్‌

  • చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు
  • నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
  • ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు

ఛీ.. ఇది పేపరా?: సీఎం జగన్‌

  • మనల్ని తిట్టేవాళ్లు కూడా ఏం రాస్తారో చూడాలని పొద్దున్నే ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తా
  • అందులో రాతలు చూసి ఛీ ఇది పేపరా అనుకుంటా
     


ఈ మధ్య వార్తల్లో చూశా.. సీఎం జగన్‌

  • చంద్రబాబు వదినగారి చుట్టం
  • తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతిచేస్తావుంటే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు
  • ఈ రెయిడ్‌ జరిగిందని తెలిసిన వెంటనే.. యెల్లో బ్రదర్స్‌ ఉలిక్కి పడ్డారు
  • దొరికితే తమ బ్రదర్‌ కాదని.. మన బ్రదర్‌ అని నెట్టేసే యత్నం చేశారు


బాబాయ్‌ను అన్యాయంగా చంపేశారు.. 

  • వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా.. బహిరంగంగా హంతకుడు తిరుగుతున్నాడు
  • ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. 
  • ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా
  • రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు
  • చిన్నాన్నను అన్యాయంగా చంపారు
  • రాజకీయంగా నాపై నెట్టేసే యత్నం చేస్తున్నారు
  • ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు.. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?
  • ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా
  • ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నా. 
  • ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా


సీఎం జగన్‌ ప్రసంగం.. 

  • లక్షల సింహాల గర్జన... చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది.
  • గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని!
  • పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?
  • మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!
  • మే 13న ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?

  • వైఎస్సార్‌ జిల్లా నేలమీద... ఈ పొద్దుటూరు గడ్డమీద...నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు
  • ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే.
  • అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా
  • కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎ‍క్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి!
  • కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు.. 


సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. 

  • నా విజయాలకు కారణమైన మీ అందరికి కృతజ్ఞతలు
  • వైఎస్సార్‌ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు
  • 58 నెలల పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం
  • 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత మనది
  • మచంకి మద్దతుపలికే ఇంతటి ప్రజాసైన్యం మధ్య యాత్రను చేపట్టా
  • మీ అంతా సిద్ధమేనా? అని గట్టిగా గర్జించండి.. సిద్ధం అని గర్జించిన ప్రొద్దుటూరు సభా ప్రాంగణం

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. 

  • సీఎం జగన్‌కు అండగా మేమంతా సిద్ధం 
  • జగనన్నకు తిరుగు లేదు
  • మీరే స్టార్‌ క్యాంపెయినర్లు
  • ఇచ్చిన ప్రతీ హామీని 
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు


ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ..

  • ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఉపన్యాసం ప్రారంభమైన బహిరంగ సభ
  • ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ ప్రారంభం
  • పేదింటి సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేశారు
  • 175 సీట్లకు 175 గెలవడం మా లక్ష్యం



 

ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగ సభ

  • సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌
  • జై జగన్‌.. జగన్‌ వన్స్‌మోర్‌ నినాదాలతో మారుమోగిన ప్రొద్దుటూరు సభాప్రాంగణం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టారు. ప్రొద్దుటూర్‌ టౌన్‌లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. 

తొలిరోజు వైస్సార్‌ జిల్లా కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేతకు నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు అభిమానుల కోలాహలం నడుమ మొదలైన యాత్ర..  సాయంత్రం వీరపనాయనిపల్లి మండలంలో ముగిసింది.

ఇదిలా ఉంటే.. దారి పొడవునా గ్రామాల్లో జనం జననేతకు నీరాజనం పట్టారు. మధ్య మధ్యలో సీఎం జగన్‌ వాహనం పైకి ఎక్కడి అభివాదం చేశారు. అంతేకాదు.. ప్రజలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలను సైతం స్వీకరించారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement