
సాక్షి, హైదరాబాద్: నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్‌కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకులు శ్రీకాంత్ గౌడ్, కిరణ్, సంజయ్ జైన్, కైలాష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నగరం వేదికగా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు.
(చదవండి: సిరి పట్టు చీర న్యూజిల్యాండ్ వెళ్లింది)
Comments
Please login to add a commentAdd a comment