navarathri celebrations
-
మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు, మనవడు పృథ్వీ, చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా , సైఫ్ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. దాదీ, మనవళ్ళ డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తోంది.అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. తాజాగా నవరాత్రి సంబరాల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, కొత్త కోడలు రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్లో నిర్వహించిన వేడుకలో చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్, ఇతర పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి నీతా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం, అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. నీతా అంబానీ తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్మేట్లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్ పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. -
నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో
దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకొంటూ భక్తిపారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు. మరోవైపు దాండియా, గార్బా నృత్యం, కోలాటాలతో ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించు కుంటున్నాయి. తాజాగా గుజరాత్లో నిర్వహించిన గార్బా డ్యాన్స్ కార్యక్రమం విశేషంగా నిలుస్తోంది. నెటిజన్ల ఫన్నీ కమెంట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సందడి ఏంటో తెలుసుకుందాం పదండి! దసరా అంటే గార్బా సందడి ఉండాల్సిందే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు,ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో గర్బా ఈవెంట్లలో చిన్నా పెద్దా అంతా అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గుజరాత్‌లోని ఒక గార్బా ఈవెంట్లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని మరీ గార్బా స్టెప్పులేయడం విశేషంగా నిలుస్తోంది. తన తోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, చక్కగా తన దారిన తాను నృత్యం చేస్తూ, పుస్తకంలో లీనమై పోయాడు. (అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?)చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ అయింది. దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఇది మరీ విడ్డూరం.. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ మరికొందరు కమెంట్ చేశారు. ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే అన్నట్టు ఇంకొక యూజర్ స్పందించారు. UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నాడ నుకుంటా అని మరొక వినియోగదారు చమత్కరించారు. (సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్)'Padhne wale bacche kahi bhi padh lete hai' just got real 😭😭 pic.twitter.com/cieAIqUMmd— Ankita (@Memeswalimulagi) October 6, 2024 -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
-
శరన్నవరాత్రులు..ఐదో రోజు మహాచండీ అలంకారం..!
చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాశుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు(చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
Dussehra 2024 : శరన్నవరాత్రులు, అన్నపూర్ణాదేవిగా పూజలు
దసరా సందర్బంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవ రాత్రులలో తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రిదేవిగా భక్తుల పూజలందుకున్న ఆ జగన్మాత మూడో రోజు(అక్టోబర్ 5వ తేదీ శనివారం)అమ్మవారిని అన్నపూర్ణా దేవి రూపంలో పూజిస్తారు. మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలందుకోనుంది.ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి 'భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణేశ్వరీ!' అని ప్రార్థిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నం పరబ్రహ్మస్వరూపం. సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణ దేవిని వేడుకుంటారు. అంతేకాదు ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, కట్టె పొంగలి, దధ్యోజనం నైవేద్యంగా పెడతారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. మరోవైపు శరన్నవరాత్రుల్లో భాగంగా నాడు మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. దుర్గా దేవి మూడో రూపమే చంద్రఘంట దేవి.చంద్రఘంట మాత పూజ చేసే వారు ఎక్కువగా ఎరుపు, నారింజ రంగులను ఉపయోగిస్తారు. ఎర్ర చందనం, ఎర్ర చున్ని, ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లను నైవేద్యంగా నివేదిస్తారు. అలాగే చంద్రఘంట అమ్మవారికి పాలతో చేసిన తియ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. (నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు ) -
తొమ్మిదిరోజులూ, తొమ్మిది రకాలు, ఇండో వెస్ట్రన్ మెరుపుల కళ
నవరాత్రులలో దాండియా ఆటలు ప్రత్యేకమైనవి. ఉత్సాహపరిచే ట్యూన్స్‌కి అనుగుణంగా నృత్యం చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలాంటప్పుడు ధరించే డ్రెస్ కూడా అడుగుల కదలికలకు తగినట్టుకదులుతున్న మెరుపులా నవరాత్రులకు ఆకర్షణీయమైన హంగుగా అమరాలి. నవరాత్రులలో దాండియా నృత్యాలు అనగానే మనకు పెద్ద పెద్ద అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన సంప్రదాయ లెహంగా– చోలీలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ ఒకే తరహా కాకుండా ఈసారి దాండియా డ్రెస్సులకు కొంత ఫ్యూజన్ ని జత చేసి, కొత్తగా మెరిపిద్దాం. అందుకు, మీ వార్డ్‌రోబ్‌ని పండగ స్పెషల్‌గా మార్చేయండి. వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్సులతోనే నవరాత్రుల్లో న్యూ లుక్‌తో ఆకట్టుకునే తొమ్మిది ఐడియాలు.. దాండియా రాత్రిలో అబ్బురపరచడానికి మరో అందమైన ఆలోచన చీరకట్టు. వేరే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు, చీరతో దాండియాలో పాల్గొనాలంటే స్టైలిష్ బ్లౌజ్ బదులుగా సంప్రదాయ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్‌ను ఎంచుకోవాలి. పెద్ద పెద్ద చెవిపోగులు, పాపిట బిళ్లను జత చేయండి. శారీ గౌన్ లేదా మల్టీకలర్ ప్లెయిన్ షిఫాన్, బనారస్, ఇకత్ శారీస్... కలంకారీ, జైపూర్ ప్రింట్స్ ఈ వేడుకకు బాగా నప్పుతాయి. వీటిమీదకు ఇండోవెస్ట్రన్ క్రాప్ టాప్ బ్లౌజ్‌లు, సిల్వర్/ఆక్సిడైజ్డ్ ఆభరణాలు ధరిస్తే ఎందరిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాయ్. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు లైట్ వెయిట్‌తో డ్రెసప్ అవాలనుకుంటారు. ఇలాంటప్పడు ఫ్లోరల్ పింట్స్, బ్రొకేడ్ స్కర్ట్ లేదా పలాజో ధరించి, టాప్‌కి తెల్లటి షర్ట్ జత చేయండి. దీనికి ఆక్సిడైజ్డ్ హారాలను అలంకారానికి ఉపయోగించండి. మోకాళ్ల కింది వరకు ఉండే గాగ్రాలు, ధోతీ ΄్యాంట్ల మీదకు స్టైలిష్ క్రాప్ టాప్‌లు వేసుకోవచ్చు. ధోతీ ప్యాంట్లను హారమ్ ప్యాంట్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి పండగల సీజన్లో ఈ ప్యాంట్స్ మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిమీదకు ఎంబ్రాయిడరీ జాకెట్స్ లేదా సింపుల్ క్రాప్‌టాప్స్ ధరించినా చాలు దాండియా హుషారు వెంటనే పలకరిస్తుంది. ప్రతిరోజూ కొత్తదనం నింపుకోవడం ఎలా అని ఆలోచనలో పడినట్లైతే దుపట్టాతో లుక్‌ని ఇట్టే మార్చేయవచ్చు. బాందినీ దుపట్టాలు నవరాత్రి కళను ఇట్టే సృష్టిస్తాయి. సల్వార్ కమీజ్ వేసుకున్నా బాందినీ దుపట్టాలను భుజం మీద నుంచి నడుము వరకు తీసుకువచ్చి, వెడల్పాటి ఎంబ్రాయిడరీ బెల్ట్‌ను పెట్టేస్తే ఆకట్టుకునే లుక్‌తో మెరిసి΄ోతారు. ఆక్సిడైజ్డ్ జూకాలు, హారాలు వేసుకుంటే చాలు. సిల్వర్/ఆక్సిడైజ్డ్ హారాలు, చైన్లు, థ్రెడ్ జ్యువెలరీ నవరాత్రి డ్రెస్సుల మీదకు ఆకర్షణీయంగా అమరుతాయి. ఆడ–మగ వాళ్లు కూడా ఈ జ్యువెలరీని హెవీ డిజైన్ ధోతీ ప్యాంట్ల మీదకు ధరించవచ్చు. -
షార్లెట్ లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు
-
శ్రీ గాయత్రీ దేవి రూపంలో అమ్మవారి దర్శనం
-
యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం
ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్‌లోని తాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్ దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు. (చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం) -
దాండియా జోష్...స్టెప్పులు అదరహో..
-
దాండియా జోష్...స్టెప్పులు అదరహో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకులు శ్రీకాంత్ గౌడ్, కిరణ్, సంజయ్ జైన్, కైలాష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నగరం వేదికగా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. (చదవండి: సిరి పట్టు చీర న్యూజిల్యాండ్ వెళ్లింది) -
నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న బెజవాడ కనకదుర్గమ్మ
-
దుర్గామాత పూజ; హారతిచ్చిన ఎంపీ నుస్రత్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ దుర్గాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో భర్త నిఖిల్ జైన్‌తో కలిసి కోల్‌కతాలోని సురుచి సంఘ మంటపం వద్ద సందడి చేశారు. దుర్గామాతకు హారతి ఇచ్చిన ఎంపీ దంపతులు, పూజారుల ఆశీస్సులు తీసుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఆ తర్వాత నిఖిల్ డోలు వాయిస్తుండగా, నుస్రత్ అక్కడున్న మహిళలతో కలిసి కాలుకదిపారు. అనంతరం తాను సైతం డోలు వాయిస్తూ మంటపంలో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా గతేడాది సైతం నుస్రత్ ఇదే విధంగా దుర్గామాత పూజలో పాల్గొనగా కొంతమంది ఓ వర్గం ఆమెపై ట్రోలింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇస్లాం మతాచారాలను అగౌరవపరిచి, తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపడ్డారు. (చదవండి: చంపుతామంటున్నారు..) ఇక బెంగాలీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. బసిర్హాట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నుస్రత్, తనకు సంబంధించిన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. -
మహిళా సాధికారతే ముఖ్యం
కోల్‌కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు. కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్‌కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది. సాల్ట్‌లేక్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్ బూత్‌ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్ వ్యాఖ్యానించారు. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి: దసరా నవరాత్రులలో నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తుంది, సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం. అన్నపూర్ణాష్టకమ్ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!! అన్నంపరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. శ్రీశైలంలోని భ్రమరాంబ కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. తేజోమయ రూపంతో ఎనిమిది భుజాలతో కనిపించే రూపం కూష్మాండ. అలంకారం, నివేదన: ఈ రోజు పులిహోర, పెసరపప్పు పాయసం నివేదన చేయాలి. ఎరుపురంగు వస్త్రాలను ధరింపచేసి కూరగాయలతో చేసిన కదంబం నివేదన చేయాలి. శ్రీసూక్త పారాయణ శ్రేష్టం.కూష్మాండ శ్లోకంసురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ! దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే !! ఈ చిత్రంలో దుర్గాదేవి వేషధారణలో ఆధ్యాత్మిక ప్రకాశంతో కనిపిస్తున్నది అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో సిన్సినాటి నగరంలో ఉంటున్న శ్రీమతి మద్దూరి సుహాసిని మధుర లాలస! ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ’ శోభానాయుడు చేత గజ్జె కట్టించుకుని, ఆమె శిష్యురాలిగా కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రచారం చేసే మార్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం తన ప్రదర్శనలో భాగంగా శోభానాయుడు తన శిష్యురాలైన మధుర లాలసకు దుర్గాదేవి వేషాన్ని ధరింపజేసి, ముమ్మూర్తులా అమ్మవారిలా ఉన్నావంటూ నమస్కరిస్తూ ఆశీర్వదించారు. తన గురువైన శోభానాయుడు కూచిపూడి నాట్యకళకు చేసిన సేవ అనితరసాధ్యమనీ, ఆమె తనను అమితంగా ప్రేమించేవారనీ మధుర లాలస కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
-
గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి/ శ్రీశైలం : ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేద మాతగా ప్రసిద్ది పొంది∙ముక్తా, విద్రమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రిదేవి. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయం నందు విష్ణువు, శిఖయందు రుద్రడు నివసిస్తుండగా త్రిమూర్తత్యంశగా గాయత్రిదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్లకి అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతగా వేదమాతగా కొలుస్తూ, గాయత్రిమాతను దర్శించుకోవడం వలన మంత్రిసిద్ధి ఫలాన్ని పొందుతారు. చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు ముక్తా విద్రుడు హేమ నీల దవళచ్ఛాౖయె ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే మయూర వాహనంపై ఆది దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే స్వామి, అమ్మవార్లను మయూర వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలరించిన కేరళ వాయిద్యకారుల ప్రదర్శన ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రతి నిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. సుమారు రెండు గంటల పాటు సాగుతున్న కళార్చన విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తున్న పల్లకీ సేవలో పంచవాయిద్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
దుర్గగుడి నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, విజయవాడ : నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, దర్శనానికి వచ్చే వాళ్లు మాస్క్ సహా అన్ని నిబంధనలు పాటించాలని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. దసరా సందర్భంగా ఆలయ దర్శనానికి ఇప్పటికే 74వేల టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యాయని, ప్రస్తుతం కేవలం 1500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం పూర్తయిన సందర్భంగా రేపటి నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. (ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్) ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆలయ ఈవో సురేష్ బాబు అన్నారు. ఇకవేళ టికెట్ సమస్యలు ఉన్నవాళ్లకి పున్నమి ఘాట్,మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయని తెలిపారు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారని ఈవో పేర్కొన్నారు. ఈసారి సామూహిక పూజలు లేవని, విఐపిలకు ఉదయం 7 నుంచి 9 వరకు సాయంత్రం 3నుంచి 5 గంటలు వరకే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీలు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆ టైం స్లాట్ ప్రకారమే దర్శనానికి రావాల్సిందిగా తెలిపారు. (నేటితో తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు) -
5న దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు
దసరా సంబరానికి ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విజయవాడ: ఏటా ఆశ్వీయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశారు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తారు. రాష్ట్ర పండుగ కావడంతో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, అగ్నిమాపక, విపత్తుల నివారణ, దేవదాయ, మత్స్య, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అక్టోబర్ 8న దుర్గమ్మ నదీవిహారం విజయదశమి రోజు అక్టోబర్ 8న అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదిలో కనుల పండువగా జరుగుతుంది. హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లు వేద మంత్రాలు, అర్చకుల ప్రత్యేక పూజల మధ్య నదీ విహారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమం నిర్వహిస్తారు. అలాగే నిత్యం నగరోత్సవం నిర్వహిస్తారు. అర్జున వీధిలోని దేవస్థానం అన్నదాన సత్రంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచిత అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించవచ్చు. -
నవరాత్రుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : దుర్గ గుడి ఉత్సవాలపై కలెక్టర్ ఇంతియాజ్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరాత్రులకు సంబంధించిన బ్రోచర్‌ని మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవాలకు సంబంధించి జాబ్ కార్డులు తయారుచేసి ఆయా డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రతకు సంబంధించి ఎన్సీసీ నుంచి 2వేల మందిని నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేశ్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. -
జన హితం.. నవరాత్రోత్సవం
పాపన్నపేట(మెదక్): జన జీవన హితాన్ని కోరి ప్రారంభించే నవరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృప పొందాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం ఏడుపాయల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్లు దుర్గమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలుచేసి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించారు. ఉదయం 10గంటలకు ఏడుపాయలకు చేరుకున్న కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేశ్ మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గమ్మ తల్లి ఆశేష భక్తుల ఆరాధ్య దైవమన్నారు. ప్రతిరోజు వివిధ అలంకారాలతో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఘనంగా పల్లకీ సేవ ఏడుపాయల దుర్గమ్మతల్లి మూల విరాట్ విగ్రహం వద్ద ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి దంపతులు, ఈఓ మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు కిష్టయ్య, నాగప్ప, దుర్గయ్య, జ్యోతిఅంజిరెడ్డి, ప్రభుగౌడ్, శ్రీధర్, చంద్రయ్య, కిషన్, నారాయణ, సంగప్ప, గౌరిశంకర్, నాగయ్య, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు నర్సింహచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై ఉంచి డప్పు చప్పుళ్లతో ఏడుపాయల్లో శోభయాత్ర నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బాలా త్రిపుర సుందరీదేవిగా.. మొదటిరోజు దుర్గమ్మ తల్లి బాల త్రిపుర సుందరిదేవి విశేష అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ముదురు పసుపురంగు వస్త్రాలతో అలంకరించారు. గోకుల్షెడ్డును రంగు రంగుల పూలు, మెరుపు కాగితాలతో తీర్చిదిద్దారు. కుంకుమార్చనకు రూ.250లు, అలాగే 9రోజుల గోత్రనామార్చన చేయించుకునే వారు రూ.1500 చెల్లించాలని భక్తులకు సూచించారు. నేడు శ్రీ గాయత్రిదేవిగా. రెండోరోజు గురువారం అమ్మవారు శ్రీ గాయత్రిగా దర్శనమివ్వనున్నారు. లేత గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి పూజల్లో పాల్గొనే భక్తులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల్లోపు హాజరు కావాలలన్నారు. -
కామాక్షి దేవిగా వర్గల్ సరస్వతి
వర్గల్: శంభునికొండపై కొలువుదీరిన వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఐదోరోజు చదువుల తల్లి కామాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.