
కామాక్షిదేవి అలంకారంలో వర్గల్ అమ్మవారు
వర్గల్: శంభునికొండపై కొలువుదీరిన వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఐదోరోజు చదువుల తల్లి కామాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.