నవరాత్రులలో దాండియా ఆటలు ప్రత్యేకమైనవి. ఉత్సాహపరిచే ట్యూన్స్‌కి అనుగుణంగా నృత్యం చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలాంటప్పుడు ధరించే డ్రెస్ కూడా అడుగుల కదలికలకు తగినట్టుకదులుతున్న మెరుపులా నవరాత్రులకు ఆకర్షణీయమైన హంగుగా అమరాలి.
నవరాత్రులలో దాండియా నృత్యాలు అనగానే మనకు పెద్ద పెద్ద అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన సంప్రదాయ లెహంగా– చోలీలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ ఒకే తరహా కాకుండా ఈసారి దాండియా డ్రెస్సులకు కొంత ఫ్యూజన్ ని జత చేసి, కొత్తగా మెరిపిద్దాం. అందుకు, మీ వార్డ్‌రోబ్‌ని పండగ స్పెషల్‌గా మార్చేయండి. వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్సులతోనే నవరాత్రుల్లో న్యూ లుక్‌తో ఆకట్టుకునే తొమ్మిది ఐడియాలు..
దాండియా రాత్రిలో అబ్బురపరచడానికి మరో అందమైన ఆలోచన చీరకట్టు. వేరే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు, చీరతో దాండియాలో పాల్గొనాలంటే స్టైలిష్ బ్లౌజ్ బదులుగా సంప్రదాయ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్‌ను ఎంచుకోవాలి. పెద్ద పెద్ద చెవిపోగులు, పాపిట బిళ్లను జత చేయండి. శారీ గౌన్ లేదా మల్టీకలర్ ప్లెయిన్ షిఫాన్, బనారస్, ఇకత్ శారీస్... కలంకారీ, జైపూర్ ప్రింట్స్ ఈ వేడుకకు బాగా నప్పుతాయి. వీటిమీదకు ఇండోవెస్ట్రన్ క్రాప్ టాప్ బ్లౌజ్‌లు, సిల్వర్/ఆక్సిడైజ్డ్ ఆభరణాలు ధరిస్తే ఎందరిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాయ్.
టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు లైట్ వెయిట్‌తో డ్రెసప్ అవాలనుకుంటారు. ఇలాంటప్పడు ఫ్లోరల్ పింట్స్, బ్రొకేడ్ స్కర్ట్ లేదా పలాజో ధరించి, టాప్‌కి తెల్లటి షర్ట్ జత చేయండి. దీనికి ఆక్సిడైజ్డ్ హారాలను అలంకారానికి ఉపయోగించండి.
మోకాళ్ల కింది వరకు ఉండే గాగ్రాలు, ధోతీ ΄్యాంట్ల మీదకు స్టైలిష్ క్రాప్ టాప్‌లు వేసుకోవచ్చు. ధోతీ ప్యాంట్‌లను హారమ్ ప్యాంట్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి పండగల సీజన్‌లో ఈ ప్యాంట్స్ మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిమీదకు ఎంబ్రాయిడరీ జాకెట్స్ లేదా సింపుల్ క్రాప్‌టాప్స్ ధరించినా చాలు దాండియా హుషారు వెంటనే పలకరిస్తుంది.
ప్రతిరోజూ కొత్తదనం నింపుకోవడం ఎలా అని ఆలోచనలో పడినట్లైతే దుపట్టాతో లుక్‌ని ఇట్టే మార్చేయవచ్చు. బాందినీ దుపట్టాలు నవరాత్రి కళను ఇట్టే సృష్టిస్తాయి. సల్వార్ కమీజ్ వేసుకున్నా బాందినీ దుపట్టాలను భుజం మీద నుంచి నడుము వరకు తీసుకువచ్చి, వెడల్పాటి ఎంబ్రాయిడరీ బెల్ట్‌ను పెట్టేస్తే ఆకట్టుకునే లుక్‌తో మెరిసి΄ోతారు. ఆక్సిడైజ్డ్ జూకాలు, హారాలు వేసుకుంటే చాలు. సిల్వర్/ఆక్సిడైజ్డ్ హారాలు, చైన్లు, థ్రెడ్ జ్యువెలరీ నవరాత్రి డ్రెస్సుల మీదకు ఆకర్షణీయంగా అమరుతాయి. ఆడ–మగ వాళ్లు కూడా ఈ జ్యువెలరీని హెవీ డిజైన్ ధోతీ ప్యాంట్ల మీదకు ధరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment