గజదొంగ అరెస్టు | gaja donga rampawan arrested in jublihills | Sakshi
Sakshi News home page

గజదొంగ అరెస్టు

Published Mon, Mar 2 2015 8:42 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

gaja donga rampawan arrested in jublihills

హైదరాబాద్ : భక్తుడిగా గుడికి వచ్చి పూజారుల కళ్లుగప్పి శఠగోపాలు, ఇతర పూజా సామగ్రి తస్కరిస్తున్న ఓ దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇ.రాంపవన్ అలియాస్ రాంబాబు(50) సోమవారం ఉదయం బోరబండ గాయత్రి హిల్స్‌లో ఉన్న సాయిబాబా దేవాలయానికి భక్తుడిగా వచ్చాడు. పూజారి హారతి ఇచ్చి గర్భగుడిలోకి వెళ్లి తీర్థప్రసాదాలను తీసుకొచ్చేలోపు అక్కడున శఠగొపం, హారతిపళ్లెం తస్కరించి పారిపోతుండగా భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నెల క్రితం చంచల్‌గూడ జైలు పక్కన దేవాలయంలో అమ్మవారి మంగళసూత్రం, శఠగోపం దొంగిలిస్తూ సీసీ కెమెరాలో చిక్కుకున్నది రాంపవనేని పోలీసుల విచారణలో తేలింది. మరికొన్ని దేవాలయాలలో చోరీలకు పాల్పడింది కూడా ఇతడేనని పోలీసులు గుర్తించారు.
(బంజారాహిల్స్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement