Lockdown: సార్‌.. మా కుక్కకు జ్వరం.. వదిలేయండి.. సరే | Lockdown In Hyderabad: Cops Allowed Man To Get Treatment For His Dog | Sakshi
Sakshi News home page

Lockdown: సార్‌.. మా కుక్కకు జ్వరం.. వదిలేయండి.. సరే

Published Mon, May 24 2021 3:17 PM | Last Updated on Mon, May 24 2021 3:30 PM

Lockdown In Hyderabad: Cops Allowed Man To Get Treatment For His Dog - Sakshi

బంజారాహిల్స్‌: సార్‌.. మా కుక్కపిల్లకు జ్వరమొచ్చింది.. వణికిపోతుంది.. మందులు వేయకపోతే చచ్చి పోయేలా ఉంది.. చూస్తూ..చూస్తూ.. ఇంట్లో ఉంచలేకపోతున్నాం.. డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తున్నా.. దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి.. అంటూ ఓ శునక యజమాని లాక్‌డౌన్‌ సమయంలో బయటికి వచ్చి పోలీసులకు చిక్కగా ఆ కుక్కను చూ పిస్తూ వేడుకున్న వైనమిది. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని సీవీఆర్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి కారులో శునకాన్ని తీసుకెళ్తూ కనిపించాడు. బయటికి ఎందుకు వచ్చారని ఎస్‌ఐ నవీన్‌రెడ్డి ప్రశ్నించగా కుక్కకు బాగా జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ జవాబు విని పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. హృదయవిదారకమైన ఈ ఘటన పోలీసులను కూడా చలింపజేసింది. దీంతో శునకాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ అతడిని వదిలి పెట్టారు. 

చదవండి: Hyderabad: ‘చేపలు అయిపోయాయి.. తప్పక చికెన్‌ తీసుకున్నా’
‘లైట్‌’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్‌ కహానీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement