హైదరాబాద్: జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహాలవారు రెచ్చిపోతున్నారు. వారు పోలీసులపై కూడా దాడి చేసే స్థాయికి చేరారు. వారిని అలాగే వదిలివేస్తే ముందు ముందు వారు ఏ స్థాయికి ఎదిగిపోతారో ఊహించుకోవచ్చు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై కొందరు దుండగులు దాడి చేశారు.
ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిలో అడిషనల్ డీసీపీ గన్‌మేన్ కూడా ఉన్నారు.
జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహాలవారి ఆగడాలు!
Published Sun, Jun 22 2014 7:32 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
Advertisement
Advertisement