వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ | Constable involved in prostitution | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో కానిస్టేబుల్

Published Thu, Sep 8 2016 8:08 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable involved in prostitution

నాగోలు: నేరాలను అరికట్టాల్సిన పోలీసులే అక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి 7వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ టి.రమేష్ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏపీఎస్‌ఈబీ కాలనీలో.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం ఇంటిపై దాడి చేయగా రమేష్ పారిపోయాడు.

ఈ ఘటనలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని ఎల్‌బీనగర్ పోలీసులకు అప్పగించారు. గదిలో ఉన్న రమేష్ గుర్తింపుకార్డు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement