
కలర్స్..అదుర్స్
బంజారాహిల్స్: పనాజీ ఈవెంట్స్ హైదరాబాద్ కోచర్ పేరుతో జూబ్లీహిల్స్ క్లబ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఫ్యాషన్‌షో నగర వాసులను అలరించింది. సినీ తారలు నిఖితానారాయణ్, సీత, షామిలీ, తేజస్విని, తేనీషచంద్రన్ తదితరులు ప్రదర్శనలో సందడి చేశారు. ఆకట్టుకునే దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తూ అలరించారు.
షోలో గందరగోళం
ఫ్యాషన్ షో ప్రారంభానికి ముందు గందరగోళం నెలకొంది. తమను అవమానపర్చడమే కాకుండా ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ ముంబైకి చెందిన నలుగురు టాప్ మోడల్స్‌తో పాటు డిజైనర్ కూడా ఈ ప్రదర్శనను బహిష్కరించారు. దీంతో ష్యాషన్ షో ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో తమకు అవమానం జరిగిందంటూ ముంబై మోడల్స్ నమ్రతషెట్టి, స్రవంతి, శతి, దీపాచారి డిజైనర్ సంఘమిత్రాసింగ్ షోను బహిష్కరించారు. నిర్వాహకులపై మండిపడ్డారు. తాజ్ హోటల్‌లో ష్యాషన్‌షో అనిచెప్పి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆరుగురు హైదరాబాద్ మోడల్స్ కూడా షో నుంచి తప్పుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న స్టార్లతో ప్రదర్శన కొనసాగించారు.