ఠాణేలోని కాశీనాథ్ ఘాణేకర్ సభాప్రాంగణంలో నిర్వహణ
భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు, యువతులు
ముంబై సెంట్రల్: ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో బుధవారం థాణేలో తెలుగువారి కోసం ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఎఫ్–టామ్ ఫ్యాషన్ విభాగం బాధ్యురాలు మచ్చ అంజలి నేతృత్వంలో ఠాణేలోని కాశీనాథ్ ఘాణేకర్ సభాప్రాంగణంలో నిర్వహించిన తెలుగువారి ‘సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో, అవార్డు ప్రదానోత్సవ’కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నటి మీనాక్షీ గడేకర్, నగల వ్యాపారి సుహాస్ మాలవీయ, టీవీ నటీమణి సష్టి సింగ్, నటుడు సిద్ధాంత్ దాండే, సెలబ్రిటీ ఆర్గనైజర్ ప్రమోద్ సింగ్, మోడల్ వల్లకాటి జ్యోతి, మేకప్ ఆర్టిస్ట్ మానసి తదితరులు హాజరయ్యారు.
ఫ్యాషన్ దివా, ‘బెస్ట్’విజేతల ఎంపిక
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడి సునీత, వేముల వాణికి బెస్ట్ స్మైల్, ఇవటూరి కిరణ్మయికి బెస్ట్ వాక్, మామిడాల హరిత రావుకు బెస్ట్ కాని్ఫడెన్స్, నారయ్య నీరజకు బెస్ట్ ఆటిట్యూడ్, జోషి ప్రియాంకకు బెస్ట్ బ్యూటిఫుల్, అనుపమకు బెస్ట్ గ్రేస్‌ఫుల్, కూన లక్ష్మీప్రసన్నకు బెస్ట్ అటైర్, పారసు నివేదితకు బెస్ట్ ఫోజ్, పోలు నూతన్‌కు బెస్ట్ ఐస్, సూర భాగ్యశ్రీకి బెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ అవార్డులు లభించాయి. ఉత్తమ ఫ్యాషన్ దివా అవార్డుల ప్రథమ విజేతగా ఉబాలే సరోజ్, రెండవ విజేతగా జోషి ప్రియాంక, మూడవ విజేతగా కూన లక్ష్మీప్రసన్న ఎన్నికయ్యారు.
అన్నిరంగాల్లో ‘తెలుగు’ముద్ర అవసరం: గంజి జగన్‌బాబు
‘‘వేగంగా మారుతున్న ప్రపంచంలో తెలుగు యువత కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలనీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఫ్యాషన్ రంగంలో కూడా తమదైన ముద్రను ఏర్పాటు చేసుకోవాలనీ, అప్పుడే తెలుగు అనే భావన, గర్వం అందరిలో కలుగుతుందని’ఎఫ్–టామ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు అభిప్రాయపడ్డారు. ముంబైలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఫ్యాషన్ రంగానికి చెందిన పూర్తిస్థాయి కార్యక్రమంగా ఫ్యాషన్ షో నిలిచిందని అన్నారు
Comments
Please login to add a commentAdd a comment