జనగామ/హైదరాబాద్: శాసన మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి(62) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీ బోడకుంటి సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి బోడకుంటిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment