
ఐసీడీఎస్ కార్యాలయమా... బార్ అండ్ రెస్టారెంటా ?
ఎమ్మెల్యే చింతల తీవ్ర ఆగ్రహం
వాల్మీకిపురం: వందలాది మంది మహిళలు పనిచేస్తున్న చిత్తూరు జిల్లాలోని వాల్మికీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నిత్యం బార్ అండ్ రెస్టారెంట్‌లా మారిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఇంటి ముందు ఉన్న ఐసీడీఎస్ కార్యాలయంలో రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా అధికారులు, బయటి వ్యక్తులు మద్యం సేవిస్తూ ప్రభుత్వ కార్యాలయాన్ని బార్‌లాగా మార్చేశారని మండిపడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల బిల్లుల్లో అవకతవకలు, జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
చారావాండ్లపల్లెలో అంగన్‌వాడీ స్థలాలు ఆక్రమణకు గురైనా అధికారులు కళ్లు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఇంకుడు గుంతలు తవ్వి ఆదర్శ వుండలంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రావూల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సవూవేశంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీవల్లి, మండల ప్రత్యేక ఆహ్వానితులు హరీష్‌రెడ్డి, తహశీల్దార్ సురేంద్ర, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.