’మోదీ నిర్ణయం హర్షణీయం’ | bjp mla chintala rama chandra reddy speaks over Demonetisation of currency | Sakshi
Sakshi News home page

’మోదీ నిర్ణయం హర్షణీయం’

Published Wed, Nov 9 2016 9:44 PM | Last Updated on Tue, Oct 30 2018 4:19 PM

’మోదీ నిర్ణయం హర్షణీయం’ - Sakshi

’మోదీ నిర్ణయం హర్షణీయం’

హైదరాబాద్‌ : నల్లధనం వెలికితీతకు భారత ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

నోట్ల రద్దుతో దేశంలో నల్లధనం పూర్తిగా బయటకు రావడంతో పాటు నకిలీ నోట్లను అరికట్టవచ్చని చింతల చెప్పారు. కొద్ది రోజులు ఇబ్బందులు ఉన్నా రాబోయే రోజుల్లో దేశం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుందన్నారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే చింతల చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement