
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
చిత్తూరు, పీలేరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిం చిన నవరత్నాల్లాంటి పథకాలతో ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.లక్ష నుం చి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బూత్ కమిటీ కన్వీ నర్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బూత్ కమి టీ కన్వీనర్ల పాత్ర కీలకమన్నారు. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా ముం దుకు పోవాలని సూచించారు. జాబి తాలో ఉన్న ఓటర్ల వివరాలను పరి శీలించి దొంగ ఓటర్లను గుర్తిం చా లన్నారు. ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తోం దని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు రోజుకో ప్రకటనతో ప్రజలను మరోమారు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలిపి నవరాత్నాల పథకాల వల్ల కలిగే లబ్ధిని వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ డి.హరిత, పార్టీ మండల కన్వీనర్ డి. జగన్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, జిల్లా అధి కార ప్రతినిధి బీడీ నారాయణరెడ్డి, కార్యదర్శి నారే వెంటక్రమణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, మహ్మద్‌షఫీ, కడప గిరిధర్‌రెడ్డి, ఎం.భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment