కేంద్రం నుంచి నిధులు రావటం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పటం సరికాదని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.
హైదరాబాద్ : కేంద్రం నుంచి నిధులు రావటం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పటం సరికాదని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రం సహకరిస్తున్నా... తమపై నిందలు వేయటాన్ని ఖండించారు. అలాగే యువతకు ఉపాధి విషయంలో కూడా తెలంగాణ బడ్జెట్లో ప్రస్తావన ఇవ్వలేదన్నారు.