
మహాగణపతి పూజకు మొదటి ఆహ్వానం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు గవర్నర్ దంపతులను ఆహ్వానిస్తూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌లు ఆహ్వాన పత్రికను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు గవర్నర్ దంపతులు మహాగణపతికి తొలి పూజ నిర్వహించేందుకు ఆహ్వానించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ముఖ్యమంత్రిని కేసీఆర్‌నూ ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్.ప్రేమ్‌రాజ్, నగేష్, వంశీ తదితరులు ఉన్నారు.